మహేష్ బాబుతో ‘జనగణమన’ సినిమా అనుకున్నాడు పూరి జగన్నాధ్. అయితే పూరి ఫ్లాపుల్లో కూరుకుపోవడంతో మహేష్, పూరిని పక్కన పెట్టేశాడు. ఇది ఓపెన్ సీక్రెట్. అయితే ఇదే కసితో మహేష్ కోసం రాసుకున్న డ్రీం ప్రాజెక్ట్ లాంటి ‘జనగణమన’ని విజయ్ దేవరకొండతో చేయాలని పూరి డిసైడైనట్లు కధనాలు వచ్చాయి. ఇటివలే వీరి మధ్య చర్చలు జరిగాయని, విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వినిపించాయి. అయితే ఇవన్నీ రుమార్స్. అసలు ఇలాంటి చర్చలు ఏమీ జరగలేదు. ఈ విషయాన్ని స్వయంగా విజయ్ దేవర కొండ చెప్పాడు.
“పూరిగారితో సినిమా చేస్తున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. మా మధ్య అలాంటి చర్చలు ఏమీ జరగలేదు. ఏదైనా వుంటే నేనే చెప్తా. ఇప్పుడు వస్తున్న వార్తలు మాత్రం రూమర్స్” అని క్లారిటీ ఇచ్చాడు విజయ్. ఇదే సందర్భంలో కొరటాల సినిమా గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు విజయ్. కొరటాల శివ, విజయ్ దేవరకొండ కలయికలో ఓ సినిమా రాబోతుందని గతంలోనే చెప్పుకున్నారు. ఈ విషయం పై తాజాగా విజయ్ మాట్లాడుతూ.. “కొరటాల గారితో ఓ సినిమా చేయాలనీ వుంది. ప్రస్తుతం ఆయన చిరంజీవిగారితో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత, నేను అప్పటికీ రెడీగా వుంటే తప్పకుండా సినిమా చేస్తాం. అది ఎప్పుడో ఇప్పుడే చెప్పలేను” అని చెప్పుకొచ్చాడు విజయ్.
మొత్తానికి పూరి సినిమా మాత్రం ఉండదని క్లారిటీగా చెప్పేశాడు విజయ్. ప్రస్తుతం విజయ్ కొత్తదనం, వైవిధ్యంతో కూడిన కధలనే ఎంచుకుంటున్నాడు. కధలో వైవిధ్యం వుంటే కొత్త దర్శకులకు కూడా ఛాన్స్ ఇస్తున్నాడు. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ భరత్ కమ్మ, అంతకుముందు టాక్సీవాల రాహుల్.. కొత్త దర్శకులే. ఇప్పుడు విజయ్ ద్రుష్టి మొత్తం వైవిధ్యం మీదే వుందే. అందుకే పూరి లాంటి మాస్, ఒకే మూస దర్శకులని కాస్త దూరం పెట్టేసినట్లే అనిపిస్తుంది. అయినా విజయ్ నిర్ణయం కూడా మంచిదే. ఊర మాస్ సినిమాలు చేయడానికి ఇంకా బోలెడు సమయం వుంది విజయ్ కి.