‘అర్జున్‌రెడ్డి’తో విజయ్ దేవరకొండకు విపరీతమైన స్టార్డమ్ వచ్చింది! ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగింది! బోల్డ్ అండ్ బ్యూటిఫుల్, కల్ట్ క్లాసిక్ సినిమాగా ‘అర్జున్‌రెడ్డి’ చిత్రాన్ని అభివర్ణించారు. అయితే.. ఆ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకోలేదు. యూత్ సినిమాగా మిగిలింది. కుటుంబ ప్రేక్షకులకు కొంచెం దూరంలో ‘అర్జున్‌రెడ్డి’ ఆగింది. ఆ సినిమా విజయం విజయ్ దేవరకొండకు సంతోషాన్ని ఇచ్చింది కానీ.. విజయ్ దేవరకొండ తల్లికి మాత్రం ఇవ్వలేకపోయింది. తనయుడు చక్కటి కుటుంబ కథా చిత్రంలో నటిస్తే చూడాలని మాధవి దేవరకొండ కోరిక. ఇంట్లో విజయ్ దేవరకొండ టీవీ పెట్టిన సమయంలో ఫ్యామిలీ జానర్ సినిమా, ఫ్యామిలీ జానర్ సినిమా సాంగ్స్ వస్తే.. ‘ఎప్పుడు ఇటువంటి సినిమా చేస్తావ్? త్వరగా చెయ్’ అని చెప్పేవారట! ‘గీత గోవిందం’ సినిమాతో ఆమె హ్యాపీ. అయితే… తరవాత వచ్చిన ‘నోటా’లో మంచి క్యారెక్టర్ చేసినా, సినిమా స్టార్టింగులో మందు కొట్టినట్టు, డ్రగ్స్ తీసుకున్నట్టు చూపించారు. అందుకు భిన్నంగా ‘టాక్సీవాలా’లో క్యారెక్టర్ చేశాడు. ‘నోటా’ ఫలితాన్ని మర్చిపోయేలా, విజయ్ దేవరకొండను కుటుంబ ప్రేక్షకులకు మరింత దగ్గర చేసేలా ఇటీవల విడుదలైన ‘మాటే వినదుగా’ పాట పాపులర్ అయ్యింది. ‘గీత గోవిందం’లో ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే’ పాటలా ఇదీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుండంతో విజయ్ దేవరకొండ మదర్ ఫుల్ హ్యాపీగా వున్నారు. సినిమా కూడా హిట్టయితే మరింత హ్యాపీ. విజయ్ దేవరకొండ, ప్రియాంకా జవల్కర్ జంటగా రాహుల్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 16న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.