అవును… విజయ్ దేవరకొండకు కోపం వచ్చింది. కోపంతో పాటు బాధ కూడా! ‘అర్జున్‌రెడ్డి’ తరవాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా ‘గీత గోవిందం’. మధ్యలో ‘ఏ మంత్రం వేసావె’ అనే సినిమా ఒకటి విడుదల అయ్యిందనుకోండి. అయితే… ‘పెళ్లి చూపులు’ చిత్రానికి ముందు ఎప్పుడో నటించిన సినిమా కావడంతో ఎవరూ లెక్కల్లోకి తీసుకోలేదు. ఇక, పరశురామ్ దర్శకత్వం వహించిన ‘గీత గోవిందం’ మరో మూడు రోజులు ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈలోపు ఎవరో సినిమాలోని కొన్ని సన్నివేశాలను నెట్టింట్లో పెట్టారు. సన్నివేశాలను లీక్ చేశారు. సోషల్ మీడియాలో కొందరు విద్యార్థులు షేర్లు చేసుకుని మరీ చూశారు. ఈ పరిణామాలపై విజయ్ దేవరకొండ ఇన్‌డైరెక్టుగా ట్వీట్ చేశారు. “ఒక్కోసారి కోపం వస్తుంది. ఇంకోసారి ఏడుపు వస్తుంది. కిందకు పడినట్టు అనిపిస్తుంది. డిజప్పాయింట్ అయ్యా. హర్ట్ అయ్యా” అని ట్వీట్లో పేర్కొన్నాడు. ప్రతి అంశాన్ని పబ్లిసిటీకి వాడుకోవడంలో విజయ్ దేవరకొండ దిట్ట. ఈరోజు జరగబోయే ‘గీత గోవిందం’ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సన్నివేశాల పైరసీ గురించి ఏం మాట్లాడతాడో చూడాలి.
I feel let down, disappointed, hurt.
Okka sari kopam osthundi, inko sari edupostundi.— Vijay Deverakonda (@TheDeverakonda) August 12, 2018