అర్జున్ రెడ్డితో స్టార్ అయిపోయాడు విజయ్‌దేవరకొండ. యూత్‌లో బాగా క్రేజ్ తెచ్చుకున్న కథానాయకుల్లో తను కూడా ఒకడు. ఈ క్రేజ్చూసే మణిరత్నం లాంటి దర్శకుడు పిలిచి మరీ ఛాన్స్ ఇవ్వబోయాడు. ఆ సినిమా ఒప్పుకుని ఉంటే విజయ్ తమిళ ఎంట్రీ జరిగిపోయేది.
మణితో సినిమా పట్టాలెక్కకపోయినా.. విజయ్ తమిళ ఎంట్రీ ఇప్పుడు ఖాయమైపోయింది. స్టూడియో గ్రీన్ సంస్థ విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయబోతోంది. ఆనంద్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. తమిళంలో సంచలన విజయం సాధించిన అరిమ నంబి (తెలుగులో డైనమైట్ గా విడుదలైంది) కి దర్శకుడు ఆయనే. ఇటీవల విజయ్ దేవరకొండని కలిసి ఓ కథ వినిపించాడు. అది విజయ్‌కి బాగా నచ్చిందని, దాంతో ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. 2018 ప్రారంభంలో ఈ చిత్రం పట్టాలెక్కబోతోంది. అన్నట్టు విజయ్ బాలీవుడ్‌కీ వెళ్లబోతున్నాడు. దానికి సంబంధించిన వివరాలూ త్వరలోనే వెల్లడవుతాయి.