ఈ యేడాది రూపాయికి పది రూపాయలు లాభం తెచ్చిపెట్టిన సినిమా ఏదైనా ఉందీ అంటే.. అది పెళ్లిచూపులునే. ఆ సినిమాతో విజయ్ దేవరకొండ ఓ బుల్లి స్టార్ అయిపోయాడు. చేతిలో వరుసగా అరడజను సినిమాలు పడిపోయాయి. విజయ్ నటించిన ద్వారక త్వరలో విడుదల కానుంది. ఈలోగా కొత్త ప్రాజెక్టులు కూడా సెట్టవుతున్నాయి. తాజాగా విజయ్ మరో సినిమాపై సంతకం పెట్టేశాడు. ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు సినిమాలతో ఆకట్టుకొన్న క్రాంతిమాధవ్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. కె.ఎస్.రామారావు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తారు.
మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు చిత్రానికి కూడా కె.ఎస్.రామూరావునే నిర్మాత. ఆ రోజుల్లోనే మరో సినిమా చేయడానికి క్రాంతితో ఎగ్రిమెంట్ కుదుర్చుకొన్నారు. ఇప్పుడు విజయ్ దేవర కొండతో ప్రాజెక్ట్ సెట్ చేసిందీ ఆయనే. ప్రస్తుతం క్రాంతి మాధవ్ సునీల్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ‘ఉంగరాల రాంబాబు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రం తుది దశకు చేరుకొంది. రాంబాబు సినిమా పూర్తయిన వెంటనే… విజయ్‌తో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.