ప్రేమకథలు తీసే యువ దర్శకులపై మణిరత్నం ప్రభావం వుంటుంది. శివ నిర్వాణకి కూడా మణిరత్నం అంటే ప్రత్యేకమైన అభిమానం. ఆ అభిమానాన్ని ఇప్పుడు ఓ పాట రూపంలో ప్రదర్శించాడు శివ నిర్వాణ. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ప్రేమకథా చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తునారు. ఈ సినిమాలోని ‘‘నా రోజా నువ్వే’’ అనే పాటని విజయ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు.
ఈ పాటని శివ నిర్వాణ స్వయంగా రాశాడు. కాశ్మీర్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని పాటని మణిరత్నం ‘రోజా’ టైటిల్ ని గుర్తు చేస్తూ మొదలుపెట్టాడు. తర్వాత అంజలి, గీతాంజలి, దిల్ సే , ఓకే బంగారం.. ఇలా మణిరత్నం సినిమాల పేర్లు పాటలో వచ్చేట్లు చూసుకున్నాడు. హేషమ్ అబ్దుల్ వాహబ్ ఇచ్చిన ట్యూన్ క్యాచి గా వుంది భిన్న నేపథ్యాలు కలిగిన ఓ జంట మధ్య సాగే ప్రేమకథతో ఈ సినిమా రూపొందుతోంది. పాటలో విజయ్ సమంతల జోడి కొత్తగా వుంది.
సెప్టెంబరు 1న సినిమా విడుదల కానుంది.