విజయ్ దేవరకొండ న్యూ ఇయర్ సందడి మొదలైయింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’ నుంచి ఫస్ట్ గ్లిమ్స్ బయటికి వచ్చింది. సాలిడ్ యాక్షన్ ఫస్ట్ టీజర్ అదిరిపోయింది. విజయ్ పాత్రని ముంబాయ్ లో స్లమ్ బాయ్ గా , చాయ్ వాలగా చూపించి .. బాక్సింగ్ రింగ్‌లో దించారు. తర్వాత వచ్చిన యాక్షన్ సీన్లు పీక్ లో వున్నాయి. విజయ్ వాట్ లాగదేంగే ,, హమ్ ఇండియన్స్ అని చెప్పిన డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్ లో వున్నాయి. టీజర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే లైగర్ పై అంచనాలని రెండింతలు పెంచేశాయి.
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సర్ప్రైజ్ లు ప్లాన్ చేశారు పూరి. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ ఈ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నాడు. ఇప్పటివరకు ఇండియన్ మూవీస్ లో నటించని మైక్ టైసన్ ను లైగర్ కనిపించడం పాన్ ఇండియా కాస్త పాన్ వరల్డ్ ఎఫెక్ట్ తెచ్చింది. ఇందులో అనన్యపాండే కథానాయిక. కరణ్ జోహార్, అపూర్వ మెహతాతో కలిసి పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొత్త ఏడాది ప్రధమార్ధంలో సినిమాని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్దమౌతున్నారు.