విజయ్‌దేవరకొండ లైన్ లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ చేరింది. బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్ డీకే దర్శకత్వంలో విజయ్‌దేవరకొండ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రానికి అశ్వనీదత్ నిర్మాత. విజయ్‌దేవరకొండ, అశ్వనీదత్ నిర్మాణంలో ఒక సినిమా చేయాలి. దీనికి సంబధించిన ఎగ్రీమెంట్ ఎప్పుడో జరిగింది. అయితే సరైన కథ కుదరలేదు. విజయ్‌దేవరకొండ కోసం చాలా కథలని వడపోశారు దత్. అయితే ఎట్టకేలకు ఒక కథ లాక్ అయ్యింది. ఇటివలే రాజ్ డీకే, విజయ్‌దేవరకొండతో ఒక కథ చెప్పారు. ఇది విజయ్ కి నచ్చింది. తర్వాత కథ అశ్వనీదత్ దగ్గరికి వెళ్ళింది. ఆయన కూడా కథకు ఇంప్రెస్ అయ్యారు. ప్రస్తుతం కథా చర్చలు జోరుగా జరుగుతున్నాయి. ఈ కథ దాదాపు ఓకే అయిపోయినట్లేనని తెలుస్తోంది.
రాజ్ డీకే తెలుగువాళ్ళే. రాజ్ నిడిమోరు, కృష్ణ దాసరి కొత్తపల్లి(డీకే) ఇద్దరూ చిత్తూరు జిల్లాకు చెందిన వారు. బాలీవుడ్ లో విలక్షణమైన చిత్రాలు. కంటెంట్ ప్రోవైడ్ చేస్తూ తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వీరు నిర్మించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరిస్ .. ఇండియాలో వెబ్ సిరీస్‌ల స్థాయిని పెంచింది. తెలుగులో కూడా మంచి సినిమా చేయాలనీ ఎప్పటినుండో ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో మహేష్ బాబుతో ఒక కథని చర్చించారు. అది ఇంకా చర్చల్లోనే వుంది. అయితే ఇప్పుడు విజయ్‌దేవరకొండతో వీరి సినిమా దాదాపు ఖరారైయింది. త్వరలోనే దీనికి సంబధించిన ఒక ప్రకటన వెలువడనుంది.