పూరి జగన్నాథ్-విజయ్ దేవరకొండల ‘లైగర్’ దారుణంగా చతికిల పడింది. సినిమా చూసిన ప్రేక్షకులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. సినిమాకి భారీ హైప్ క్రియేట్ చేశారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ నెగెటివ్ హైప్ క్రియేట్ అయ్యింది. విజయ్ ఫ్యాన్స్ అయితే తలలు పట్టుకుంటున్నారు. దర్శకుడు పూరి మీద చాలా గుస్సాగా వున్నారు. అయితే ఇపుడు అందరి దృష్టి పూరి-విజయ్ కాంబినేషన్లో రాబోతున్న మరో సినిమా ‘జనగణమన’ మీదికి మళ్లింది. ఈ సినిమా ఎలా వుంటుందో అనే టెన్సన్ ఫ్యాన్స్ లో మొదలైయింది.
నిజానికి మహేష్ బాబుతో ఈ సినిమా చేయాలన్నది పూరి ఆలోచన. కానీ మహేష్ ఈ ప్రాజెక్ట్ రాలేదు. ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్ కొట్టడంతో విజయ్ తో లైగర్ ఓకే అయ్యింది. అదే సమయంలో ‘జనగణమన’ కూడా ప్రకటించారు. అయితే లైగర్ లాంటి ఫ్లాఫ్ తర్వాత మళ్ళీ అదే దర్శకుడితో సినిమా అంటే బిజినెస్ పరంగా కూడా కష్టమే. అయితే విజయ్ కి ఇప్పుడు ఎలాంటి ఛాన్స్ లేదు. కారణం.. జనగణమన ఇప్పటికే ఒక షెడ్యుల్ పూర్తి చేశారు. ఇప్పుడు వెనక్కి వెళ్ళడం కష్టం. మొత్తనికి పూరి దగ్గర లాక్ అయిపోయాడు విజయ్.