సినిమా హిట్ అయితే బ్యానర్లు బారులు తీరతాయి. హీరోలు ఓ చాన్సిచ్చి చూద్దాం అనుకుంటారు. బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్ లు ఇచ్చిన డైరక్టర్ శివ నిర్వాణ కు అలాంటి ఆఫర్ ఒకటి వచ్చింది. యూత్ ఐకాన్ గా క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ నుంచి సానుకూల స్పందన వచ్చింది.
మజిలీ హిట్ అయిన నేపథ్యంలో దర్శకుడు శివనిర్వాణ వెళ్లి హీరో విజయ్ దేవరకొండను కలిసారు. ఆయనతో సినిమా చేయాలని వుందని చెప్పడంతో, మంచి కథ వుంటే తనకు అభ్యంతరం లేదని, కానీ డిసెంబర్ తరువాతే డేట్ లు ఇవ్వగలనని చెప్పినట్లు తెలుస్తోంది.
దాంతో ఇప్పుడు విజయ్ కు సరిపడా పాయింట్, స్క్రిప్ట్ తయారుచేయాలని శివనిర్వాణ ఫిక్స్ అయ్యాడు. బ్యానర్ ఎలాగూ రెడీ గా వుంది. మజిలీ నిర్మించిన షైన్ పిక్సర్స్ బ్యానర్ కే మరో సినిమా చేయాల్సి వుంది. అందువల్ల అన్నీ కుదిరితే శివనిర్వాణ-విజయ్ కాంబినేషన్ లో డిసెంబర్ నుంచి సిన్మా వుంటుంది.