జనగణమన సినిమా ఆగిపోయింది. ఇప్పుడు విజయ్‌దేవరకొండ ధ్యాసంతా ఖుషి సినిమా మీదే. ఆ తరవాత దిల్ రాజు బ్యానర్లో ఓ సినిమా చేస్తున్నాడని తెలుగు 360 ముందే చెప్పింది. దిల్ రాజు దర్శకుడి కోసం అన్వేషణ మొదలెట్టారు. హరీష్ శంకర్ తో భేటీ వేసినా… విజయ్‌కి పరిపడా కథ దొరకలేదు. ఇప్పుడు ఇంద్రగంటి మోహన కృష్ణతో విజయ్ కోసం ఓ కథ సిద్ధం చేయిస్తున్నట్టు తెలుస్తోంది. మాస్, యాక్షన్ ఇమేజ్‌కు దూరంగా, ఓ లవ్ స్టోరీ చేయాలని విజయ్ డిసైడ్ అయ్యాడు. అలాంటి రొమాంటిక్, లవ్, ఎంటర్టైనర్లకు ఇంద్రగంటి ప్రసిద్ధి. పైగా.. చాలా తక్కువ టైమ్ లో సినిమాని పూర్తి చేసి ఇవ్వగలడు. అందుకే.. ఇంద్రగంటి అయితే బాగుంటుందని దిల్ రాజు భావిస్తున్నాడట. ఇప్పటికే ఇంద్రగంటి రెండు మూడు లైన్లు వినిపించాడని, అందులో ఒకటి నచ్చిందని, విజయ్ కి ఒకసారి నేరేషన్ ఇప్పించి, తరవాతి స్టెప్ వేయాలన్నది దిల్‌రాజు ప్లాన్. ఇంద్రగంటి ప్రస్తుతం `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా హిట్ అయితే… ఇంద్రగంటికి విజయ్ తో సినిమా చేయడం మరింత ఈజీ అయిపోతుంది.