‘గీత గోవిందం’ సినిమాతో గీతా ఆర్ట్స్ ద్వారా ఓ మర్చిపోలేని విజయాన్ని అందుకొన్నాడు విజయ్ దేవరకొండ. ఆ వెంటనే గీతా ఆర్ట్స్ లో మరో సినిమా చేయాలి. కానీ తనకున్న కమిట్మెంట్స్ వల్ల కుదర్లేదు. పరశురామ్ తోనే గీతా ఆర్ట్స్ లో ఓ సినిమా ఫిక్సయితే, అది కాస్త మెల్లగా దిల్ రాజు చేతుల్లోకి వెళ్లిపోయింది. అప్పట్లో చిన్న కమ్యునికేషన్ గ్యాప్ వల్ల, ఓ వివాదం మొదలైనా, తొందరగానే సద్దుమణిగిపోయింది. అయితే అప్పటి అడ్వాన్స్ ఇప్పటికీ విజయ్ దగ్గర ఉంది. విజయ్ కోసం ఓ కథ రెడీ చేయడానికి గీతా ఆర్ట్స్ నానా హైరానా పడిపోతోంది. 2024లోనే విజయ్‌తో ఓ సినిమా చేయాలని గీతా ఆర్ట్స్ ప్లాన్.
‘ఫ్యామిలీ స్టార్’ అవ్వగానే గౌతమ్ తిన్ననూరి కథ సెట్స్‌పైకి వెళ్తుంది. ఆ తరవాతే గీతా ఆర్ట్స్ సినిమా ఉంటుంది. ఈలోగా విజయ్ కోసం ఓ కథ రెడీ చేయడం గీతా ఆర్ట్స్‌కి పెద్ద మేటరేం కాదు. కానీ విజయ్ చూపంతా పెద్ద దర్శకులపై ఉంది. కొత్త వాళ్లు, మీడియం రేంజు దర్శకులతో సినిమా చేయడానికి విజయ్ అంత సముఖంగా లేడు. కథ బాగా టెప్ట్ చేస్తే తప్ప, అటు వైపు చూడడం లేదు. పైగా మాస్ కథ వద్దంటున్నాడట. ఇటీవల గీతా ఆర్ట్స్ నుంచి ఓ టాప్ డైరెక్టర్ మాస్ కథతో వెళ్తే… ‘ఇంత మాస్ మనకెందుకు’ అని పక్కన పెట్టినట్టు టాక్. ‘లైగర్’ రిజల్ట్ వల్ల ఊర మాస్ కథలకు దూరంగా ఉండాలని విజయ్ ఫిక్సయి ఉంటాడు. మరి గీతా ఆర్ట్స్‌లో విజయ్ సినిమా ఎప్పటికి సెట్ అవుతుందో?