‘గీత గోవిందం’తో వందకోట్ల క్లబ్లో చేరిన విజయ్ దేవరకొండ నటిస్తున్న తెలుగు, తమిళ సినిమా ‘నోటా’. రేపు… అనగా గురువారం నాలుగు గంటలకు ట్రైలర్ విడుదల చేయనున్నారు. అదెలా వుంటుందో చెప్పడానికి అన్నట్టు ఈరోజు చిన్న వీడియో విడుదల చేశారు. అందులో స్టోరీ లైన్ ఏంటో చెప్పేశారు. రౌడీ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ఓ యువకుడి ప్రయాణమే సినిమా. ఇక్కడ రౌడీ అంటే గూండాగిరి చేసేవాడు కాదు. విజయ్ దేవరకొండ నేటితరం యువతను, అభిమానులను ముద్దుగా రౌడీస్ అని పిలుస్తున్నాడు కదా! అటువంటి రౌడీ అన్నమాట! స్నీక్ పీక్ స్టార్టింగులో చూపించిన విజువల్స్ చూస్తే… పబ్బులు, అమ్మాయిలు, డ్రగ్గులు ‘అర్జున్‌రెడ్డి’ తరహా పాత్రచిత్రణ కనబడుతోంది. తర్వాత కొన్ని క్షణాల్లో రాజకీయ నాయకుడిగా విజయ్ దేవరకొండ నటన అబ్బురపరుస్తుంది. అనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్. మొత్తానికి ఈ రోజు విడుదల చేసిన ‘నోటా’ స్నీక్ పీక్ రేపు విడుదల కాబోయే ట్రైలర్ మీద ఆసక్తి రేకెత్తించేలా ఉంది!!