ఈమధ్య విజయ్‌దేవరకొండ ట్రోల్స్‌కి బాగా బలైపోతున్నాడు. తన వేషధారణ, ఇచ్చే చిత్రవిచిత్రమైన స్టేట్మెంట్స్.. ట్రోల్స్‌కి గురవుతున్నాయి. అయితే వీటిని అస్సలు సీరియస్‌గా తీసుకోనని, పైగా తనకు ఇలాంటి ట్రోల్స్ అంటే చాలా ఇష్టమని చెబుతున్నాడీ రౌడీ.
“నా గురించి ఒకరు ట్రోల్ చేస్తున్నారంటే, తనకి నాపై ఎంత ప్రేమ ఉండాలి. నిద్ర కూడా పోకుండా నా గురించి ఆలోచిస్తున్నాడన్నమాటే కదా. తెల్లారే లేచి, నా గురించి ఏదైనా కామెంట్ చేస్తున్నాడంటే అంత కంటే ఏం కావాలి..? జనం నా గురించి మాట్లాడుకోవాలంతే. అది ఎలా అన్నది నాకు అవసరం లేదు. డిస్కర్షన్స్‌లో నా పేరు వినిపించాలి. అంతే“ అంటూ స్పోర్టివ్‌గా మాట్లాడాడు. రివ్యూల గురించి కూడా తాను పెద్దగా పట్టించుకోడట. “సినిమా ఎలా ఉందో నాకంటే రివ్యూవర్స్ బాగా విశ్లేషిస్తుంటారు. వాళ్ల రివ్యూలు చూసి, ఓహో.. మనం ఈ కోణంలో సినిమాని చూడాలన్న మాట` అనుకుంటుంటాను. కొన్ని రివ్యూలు మరీ రొటీన్‌గా ఉంటాయి. వాటిని అస్సలు చదవబుద్ధి కాదు“ అని చెప్పుకొచ్చాడు.
నిజానికి విజయ్ దేవరకొండకు తన సినిమాల్ని ఎలా పబ్లిసిటీ చేసుకోవాలో బాగా తెలుసు. కానీ ‘వలర్డ్ ఫేమస్ లవర్’ గురించి పెద్దగా మాట్లాడడం లేదు. అది కూడా ఓ పబ్లిసిటీనే అంటున్నాడు విజయ్. ”ఈ సినిమా గురించి పెద్దగా మాట్లాడకూడదని ముందే అనుకున్నా. కానీ.. ఇప్పుడు జనం ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. మనం ఏమీ చేయకపోయినా సినిమా జనంలోకి వెళ్లడం గొప్ప విషయమే కదా” అని చెప్పుకొచ్చాడు విజయ్.