విజయ్ దేవరకొండ – రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో మైత్రీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం కోసం ‘రణభాలీ’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదో పిరియాడిక్ యాక్షన్ డ్రామా. ఇందులో విజయ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు సమాచారం. బ్రిటీష్ వారి కాలంలో కొంత కథ నడుస్తుంది. ఆ కథంతా ఫ్లాష్ బ్యాక్ రూపంలో వస్తుందని, ఫ్లాష్ బ్యాక్ లో తండ్రి పాత్ర పవర్ఫుల్ గా తీర్చిదిద్దారని ఇన్ సైడ్ వర్గాల టాక్. దాదాపు రూ.200 కోట్లతో ఈచిత్రాన్ని మైత్రీ మూవీస్ అత్యంత భారీగా రూపొందిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. రష్మిక కథానాయికగా నటిస్తోంది. విజయ్ – రష్మికల జోడీకి ఇది హ్యాట్రిక్ సినిమా. ఇది వరకు ‘గీత గోవిందం’తో హిట్టు కొట్టారు. ‘డియర్ కామ్రెడ్’ ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదు. రష్మికతో పాటుగా మరో కథానాయికగా కూడా కనిపించబోతోంది. ఆమె ఎవరన్నది త్వరలో ప్రకటిస్తారు. విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్నాడు. అది పూర్తయిన వెంటనే ‘రణభాలీ’ సెట్స్‌పైకి వెళ్తుంది.