దిల్ రాజు కి నష్టాలు మిగిల్చిన సినిమా ఫ్యామిలీ స్టార్. విజయ్ దేవరకొండ హీరోగా దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా దారుణంగా దెబ్బకొట్టింది. కనీసం ఓపెనింగ్స్ రాబట్టుకోలేపోయింది. అయితే మళ్ళీ దిల్ రాజు బ్యానర్ లోనే ఓ సినిమా చేస్తున్నాడు విజయ్. రాజావారు రాణి వారు ఫేమ్ రవికిరణ్ కోలా డైరెక్టర్ గా దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ సినిమా పనులు సైలెంట్ జరుగుతున్నాయి.
ఈ సినిమాకి అఫీషియల్ గా టైటిల్ ఫిక్స్ చేశారు నిర్మాత దిల్ రాజు. సీతమ్మ వాకిట్లో రీరిలీజ్ ప్రెస్ మీట్ లో విజయ్ సినిమా టైటిల్ ని మాటల్లో మాటగా చెప్పేశారు. విజయ్ తో రౌడీ జనార్ధన్ సినిమా చేస్తున్నాం. నితిన్ తో ఎల్లమ్మ సినిమా జరుగుతుందని తన బ్యానర్ లో రాబోతున్న రెండు సినిమాల టైటిల్స్ ని రివిల్ చేశారు. నితిన్ ఎల్లమ్మకి వేణు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.