లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ లో చిన్న పాత్రతో పరిచయమై రౌడీగా ప్రేక్షకుల మనసులో చోటు సంపాయించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇపుడు పూరి జగన్నాధ్ లైగర్ సినిమాతో పాన్ ఇండియా సినిమా చేశాడు. ఐతే ఈ సినిమా విడుదల కాకముందే విజయ్ కి పాన్ ఇండియా ఫాలోయింది వచ్చింది. నిజంగా విజయ్ ఊహించని ఇమేజ్ ఇది. ప్రస్తుతం లైగర్ ప్రమోషన్స్ జోరుగా చేస్తున్న విజయ్.. తన గురించి మరో ఆసక్తికరమైన సంగతి చెప్పాడు. విజయ్, తేజ దగ్గర సహాయ దర్శకుడిగా చేశాడట.
” నటుడిగా ఇంకా కెరీర్ ప్రారంభించక ముందు ఇండస్ట్రీలో పరిచయాలు పెరగడం కోసం తేజ గారి దగ్గర సహాయ దర్శకుడిగా చేసేవాడిని. పూరి గారు అయితే సహాయ దర్శకులకు మంచి సాలరీలు ఇస్తారని నాన్న ఒకసారి చెప్పారు. కానీ పూరి గారిని కలవడం కుదరలేదు. డియర్ కామ్రేడ్ తర్వాత కలిశాను. ఆయన చెప్పిన కథ విన్నాను. అదే లైగర్” అని చెప్పుకొచ్చాడు విజయ్. ఈనెల 25న లైగర్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.