విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైగర్ షూటింగ్ దాదాపు పూర్తయింది. తాజగా లైగర్ నుండి ఒక స్టన్నింగ్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ దాదాపు నగ్నంగా తన దేహాన్ని ప్రదర్శించి ఆశ్చర్యపరిచారు. ఇలా కనిపించడానికి చాలా ధైర్యం ఉండాలి. పాత్ర విషయంలో తనకు ఎలాంటి హద్దులు, సంకోచాలు ఉండవని ఈ పోస్టర్ తో స్పష్టం చేశాడు విజయ్.
ఎంఎంఎ ఫైటర్గా నటించడానికి విజయ్ దేవరకొండ పూర్తిగా ట్రాన్సఫర్మేషన్ అయ్యాడు “ నా సర్వస్వం తీసుకున్న సినిమా ఇది. నటన పరంగా, మానసికంగా, శారీరకంగా నా మోస్ట్ ఛాలెంజింగ్ రోల్. నేనుమీకు అన్నీ ఇస్తాను! త్వరలో. #లైగర్” అని విజయ్ ట్వీట్ చేశాడు. లైగర్ లో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే కథానాయికగా నటిస్తుంది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.