టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ కి రంగం సిద్ధం అయ్యింది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతోంది. కేదార్ సెలగంశెట్టి నిర్మాత. 2022లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశాడు. “ప్రేక్షకులకు ఎప్పటికీ మరచిపోలేని ఓ సినిమా ఇస్తున్నామని నమ్మకంగా చెబుతున్నా“ అంటూ ట్విట్టర్ లో తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు విజయ్. ప్రస్తుతం `పుష్ఫ` సినిమాతో బిజీగా ఉన్నాడు సుకుమార్. 2021లో ఈ సినిమావ విడుదల అవుతుంది. విజయ్ సినిమా 2022లో మొదలవుతుంది. ఈగ్యాప్లో సుకుమార్ మరో సినిమా చేస్తాడా? లేదంటే విజయ్ కోసం ఎదురు చూస్తాడా? అన్నది తేలాల్సివుంది.