‘నాంది’ తో ఆకట్టుకొన్న దర్శకుడు విజయ్ కనకమేడల. ఆ తరవాత నరేష్‌తోనే… ‘ఉగ్రం’ రూపొందించాడు. ఉగ్రం కమర్షియల్‌గా పెద్దగా సక్సెస్ కాలేదు కానీ, దర్శకుడిగా విజయ్‌కి మంచి పేరే తీసుకొచ్చింది. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాకి సన్నాహాలు చేసుకొంటున్నాడు. ఈసారి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి ఓ కథ చెప్పాడు. నాంది, ఉగ్రం రెండూ సోషల్ ఇష్యూల్ని బేస్ చేసుకొన్న కథలే. అయితే ఈసారి మాత్రం కమర్షియల్ సినిమా చెప్పబోతున్నాడని తెలుస్తోంది. రాధామోహన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారు. బెల్లంకొండ చేతిలో ఉన్న మూడో సినిమా ఇది. ఓ వైపు సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఓ షెడ్యూల్ పూర్తయ్యింది. మరో కొత్త షెడ్యూల్ ఈవారంలోనే మొదలు కానుంది. రమేష్ వర్మతో ‘రాక్షసుడు 2’ పట్టాలెక్కిస్తున్నాడు. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ముందుగా సాగర్ చంద్ర సినిమా పూర్తవుతుంది. ఆ తరవాత.. విజయ్ కనకమేడల సినిమా ప్రారంభిస్తారు. దాంతో పాటుగా రాక్షసుడుని సమాంతరంగా పూర్తి చేసే అవకాశం ఉంది.