విలాస పురుషుడు విజయ్ మాల్యాను లండన్ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆయనకు బెయిలు కూడా మంజూరు చేసింది. భారత్‌కు ఆయన్ను తిప్పి పంపే చర్యలను వేగవంతం చేస్తామని ఇంగ్లండ్ ప్రధాన మంత్రి చెప్పారు. నెహ్రూ భవన్‌లోనూ, 10 డౌనింగ్ స్ట్రీట్‌లోనూ నిర్వహించిన రహస్య సమావేశాలు మాల్యా అరెస్టుకు దారి తీశాయి. తమకు అప్పగించాలన్న భారత్ వినతి అనంతరం ఆయన్ను అరెస్టు చేశారు. స్కాట్లాండ్ యార్డు పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అవినీతిపై తన సమరం ఆగదని బీజేపీ ప్రభుత్వం ఈ చర్యతో చెప్పకనే చెప్పింది. మాల్యాను వెస్ట్ మినిస్టర్ కోర్టులో హాజరుపరచనున్నారు. కిందటేడాది మార్చి2న ఆయన లండన్‌కు పారిపోయారు. బ్యాంకులకు ఆయన మొత్తం 9వేల కోట్లకు పైగానే బకాయిపడ్డారు. కోర్టు నోటీసులను బేఖాతరు చేయలేదు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 800 కోట్లు, యునైటెడ్ బ్యాంకుకు 430 కోట్లు, యుకో బ్యాంకుకు 320 కోట్లు, ఫెడరల్ బ్యాంకుకు 90 కోట్లు, ఐడీబీఐ 800 కోట్లు, ఐఓబీ 140కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా 650 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా 550 కోట్లు, పంజాబ్ సింధ్ బ్యాంకుకు 60 కోట్లు, సెంట్రల్ బ్యాంకుకు 410 కోట్లు, యాక్సిస్ బ్యాంకుకు 50 కోట్ల రూపాయలు బకాయి పడ్డారు. మాల్యా అంశంలో భారత ఆర్థిక మంత్రి కుఅరుణ్ జైట్లీ నేరుగా ఇంగ్లండ్ ప్రధాని థెరిసా మేతో మాట్లాడారు. అతణ్ణి తమకు అప్పగించాలసిందిగా కోరారు. రెండు రోజుల చర్చోపచర్చల నడుమ ఎట్టకేలకూ విజయ్ మాల్యాను అరెస్టు చేశారు. భారత దేశాన్ని విడిచి పారిపోయిన ఒక వ్యక్తిని ఆయన ఆశ్రయం పొందుతున్న దేశం అరెస్టు చేయడం చరిత్రలో ఇదే ప్రథమం. మొత్తం 18మందిని తమకు అప్పగించాల్సిందిగా ఇంగ్లండ్‌ను భారత్ కోరింది. విజయ్ మాల్యా తరవాత కేంద్రం చేపట్టబోయే కేసు లలిత్ మోడీదేనని తెలుస్తోంది. విజయ్ మాల్యా అరెస్టు ద్వారా మోడీ ప్రభుత్వం తన థ్యేయాన్ని చెప్పకనే చెప్పింది. అవినీతి పరుల గుండెల్లో ప్రమాద ఘంటికలను మోగించే చర్య విజయ్‌మాల్యా అరెస్టుతో ప్రారంభమైంది. ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేసింది.
సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి