బ్యాంకులని మోసం చేసి లండన్ పారిపోయిన విజయ్ మాల్యాపై దేశ బహిష్కరణ వేటు వేయడానికి కసరత్తు జరుగుతున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. సుప్రీం కోర్టు, ఈడి కోరినా భారత్ తిరిగిరావడానికి నిరాకరిస్తున్న విజయ్ మాల్యాని వెనక్కి రప్పించేందుకు ఇదే సరయిన మార్గమని భావిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఆయన పాస్ పోర్ట్ తాత్కాలికంగా రద్దు చేయబడింది. ఇప్పుడు దేశ బహిష్కరణ వేటు కూడా వేసినట్లయితే ఆయనను అరెస్ట్ చేసి భారత్ పంపవలసిందిగా బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరడానికి అవకాశం కలుగుతుంది కనుక ఈ ‘ఆప్షన్’ న్ని వినియోగించుకోవడానికి కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఒక విషయం మాత్రం స్పష్టం అవుతోందిపుడు. కేంద్రప్రభుత్వం చేపడుతున్న ఇటువంటి చర్యలు అది ఆయనతో కటినంగా వ్యవహరించాలనుకొంటునట్లు స్పష్టం చేస్తున్నాయి. ఆయన రాజ్యసభ సభ్యత్వం కూడా రద్దు చేసే అవకాశం ఉందేమో కేంద్రం పరిశీలిస్తే బాగుంటుందేమో? తద్వారా అయనకున్న దౌత్యహోదా కూడా తొలగించినట్లవుతుంది కదా? పరిస్థితి అంతవరకు వచ్చేమాటయితే విజయ్ మాల్యా ఈలోగానే తన అప్పులను తీర్చి ఈ సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేసినా ఆశ్చర్యం లేదు.