ఎన్నో గొడవలతో రిలీజ్ అయిన పులి ప్రేక్షకులను ఆకట్టుకుందా అంటే లేదంటున్నారు విశ్లేషకులు. సినిమా గురించి దర్శకుడు ఇచ్చిన షో అంతా ఇంతా కాదు ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలోనే రాలేదని తెగ బిల్డప్ ఇచ్చాడు. అందులో నటించిన నటీనటులు కూడా పులి అమాంతం ఎత్తేశారు. తీరా రిలీజ్ అయ్యాక గాని తెలిసింది ఇది పంజా విసరలేని పులి అని. రిలీజ్ రోజే ఎన్నో గొడవలతో వేయాల్సిన బెనిఫిట్ షోస్ అన్ని క్లోజ్ చేసుకున్న పులి టీంకు సినిమా టాక్ కూడా అంత గొప్పగా రాకపోవడంతో దర్శక నిర్మాతలకు భయం పట్టుకుంది.
అయితే సినిమాలో యానిమల్ గ్రాఫిక్స్ బాగున్నా సినిమా కేవలం చిన్నపిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి చెప్పే చందమామ కథలా ఉండతంతో థియేటర్ నుండి వస్తున్న ఆడియెన్స్ అందరు పెదవి విరుస్తున్నారు. చెప్పడానికైతే బాహుబలిని మించి ఈ సినిమా కలెక్షన్స్ ఉంటాయని డప్పుకొట్టిన పులి కాస్త పిల్లి అయ్యేసరికి చిత్ర యూనిట్ అంతా నిర్గాంతపోతున్నారు.ఇళయదళపతి విజయ్ గా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ నటన అక్కడ ఫ్యాన్స్ ని ఆకట్టుకున్న తెలుగులో మాత్రం ఈ సినిమా ఒక డిజాస్టర్ గానే మిగులుతుందని చెప్పొచ్చు.
దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో గ్రాఫిక్స్ , ఆర్ట్ వర్క్ పరంగా అద్భుతంగా ఉన్నా చిన్నప్పటినుండి తెలిసిన రాజు కథల్లో ఒకటి కావడంతో ఆడియెన్స్ దీన్ని రిసీవ్ చేసుకోలేకపోయారు.