జెడ్ ప్లస్ సెక్యూరిటీతో ఉన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని సామాన్యుడి కేటగిరిలో చేర్చి తనిఖీలు చేయడాన్ని వై ఎస్ ఆర్ సి పి లో నంబర్ 2 నాయకుడు అయిన విజయసాయిరెడ్డి సమర్థించుకున్నారు. నిబంధనల ప్రకారం జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వాహనాలను నేరుగా అనుమతించవలసిందిగా ఉన్నప్పటికీ అనుమతించకుండా నిబంధనలను ఉల్లంఘిస్తూ వ్యవహరించడం విమర్శలకు చోట ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎపిసోడ్ పై వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.
విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ.. ” ప్రతిపక్ష నేతగా ఉండగా జగన్ గారిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగినపుడు భద్రత ఎందుకు కల్పించలేదని అడగని పచ్చ మీడియా చంద్రబాబుకు ఏదో జరిగినట్టు శోకాలు పెడుతోంది. ఆయన కాన్వాయ్కి ట్రాఫిక్‌ను ఆపడం లేదట. ఎయిర్‌పోర్టులో తనిఖీలు చేస్తే అవమానించినట్టట ” అంటూ వ్యాఖ్యలు చేశారు.
ప్రతిపక్ష నేతగా ఉండగా జగన్ గారిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగినపుడు భద్రత ఎందుకు కల్పించలేదని అడగని పచ్చ మీడియా చంద్రబాబుకు ఏదో జరిగినట్టు శోకాలు పెడుతోంది. ఆయన కాన్వాయ్కి ట్రాఫిక్‌ను ఆపడం లేదట. ఎయిర్‌పోర్టులో తనిఖీలు చేస్తే అవమానించినట్టట.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 15, 2019
మొత్తానికి దీన్ని చూసిన జనాలు మాత్రం, బహుశా ఇది కేవలం శాంపిల్ మాత్రమే అయి ఉండవచ్చని, భవిష్యత్తులో ఇలాంటి వేధింపులు మరెన్నో జరిగే ఆస్కారం ఉందని భావిస్తున్నారు.