వైఎస్సార్సీపీ నేత విజయసాయి రెడ్డి పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. నువ్వు ఒక అమ్ముడుపోయిన వ్యక్తివి, నువ్వు ఉల్లిపాయ మీద పొట్టు కూడా తీయలేవు అంటూ తీవ్ర పదజాలంతో పవన్ కళ్యాణ్ ని విమర్శించారు. నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకు వచ్చావు, నీ బతుకు, గంతులేసి వెళ్ళు అంటూ తీవ్ర పదజాలం ని ఉపయోగిస్తూ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశారు.
విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ, “నువ్వొక అమ్ముడు పోయిన వ్యక్తివి. ఉల్లిపాయ మీద పొట్టు కూడా తీయలేవు పవన్ కళ్యాణ్. అమాయకుల అభిమానాన్ని తాకట్టు పెట్టి నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకు వచ్చినోడివి. ఏప్రిల్ 11 వరకు గంతులేసి వెళ్లు. నీ బతుక్కు తాటలు తీయడమొకటా? నీ యజమాని చంద్రబాబే అన్ని సర్ధుకుంటున్నాడు.”
అయితే విజయ్ సాయి రెడ్డి వ్యాఖ్యలపై నెటిజన్లు అంతే దీటుగా స్పందిస్తున్నారు. ఏ-2 గా జైలుశిక్ష అనుభవించిన మీరు కూడా నీతులు చెప్తున్నారా అంటూ ప్రశ్నించారు. అయితే పవన్ కళ్యాణ్ గతంలో వైఎస్ఆర్సిపి మీద విమర్శలు చేసినప్పుడల్లా, అధికారంలో ఉన్న చంద్రబాబు ని వదిలేసి మమ్మల్ని ఎందుకు విమర్శిస్తున్నారు అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు అందరూ పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించేవారు . మరి ఇప్పుడు వైఎస్ఆర్ సీపీ నేతలు పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తున్నపుడు, వారు గతంలో వాడిన లాజిక్ వాళ్లకు వర్తించదా అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
మాకు 100 సీట్లు వస్తాయంటూ వైఎస్సార్ సిపి నేతలు పైకి చెబుతున్నా, విజయసాయి రెడ్డి లాంటి నేతలు వరుసబెట్టి ట్వీట్లు చేస్తూ అసహనం వ్యక్తం చేయడం చూస్తుంటే వైఎస్ఆర్సీపీ నేతలకు కూడా గెలుపు మీద బాగానే అనుమానాలు ఉన్నాయేమో అనిపిస్తోంది.