ఇతరులు చెప్పిన మాటలు విని, తనను వెన్నుపోటుదారుడిగా జగన్ భావించాడని సిట్ విచారణ అనంతరం విజయసాయిరెడ్డి తెగ బాధపడిపోయారు. ఆయన చుట్టూ ఉండే కోటరీ తనను చాలా అవమానాలకు గురి చేసిందని, అందుకే పార్టీని వీడి బయటకు వచ్చానని వాపోయారు. ఆయన ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలను గమనిస్తే.. జగన్ – విజయసాయిరెడ్డిల మధ్య గ్యాప్ పెరుగుతూ పోయిందని, అందుకు సజ్జల వంటి నేతలే కారణమని స్పష్టం అవుతోంది.
సజ్జల వంటి నేతల మాటలు విని తనకు నమ్మినబంటులా ఉండిన విజయసాయిరెడ్డిని జగన్ దూరం పెట్టేశారనేది అర్థం అవుతోంది. అయినప్పటికీ జగన్ గురించి ఆయన ఒక్కమాట కూడా మాట్లాడలేదు. లిక్కర్ స్కామ్ వెనక బిగ్ బాస్ ఉన్నారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే తనకు ఏం తెలియదని తెలివిగా సమాధానం చెప్పారు ఈ స్కాంలో కీలక వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని సిట్ విచారణ అధికారులుప్రశ్నించారని.. అందుకు తనకు ఏం తెలియదని, అంతా రాజ్ కసిరెడ్డికే తెలుసునని చెప్పినట్లు స్పష్టం చేశారు.
మొత్తానికి ఈ కేసులో జగన్ కు విజయసాయిరెడ్డి నుంచి ఎలాంటి థ్రెట్ ఉండబోదని ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. రాజ్ కసిరెడ్డిని బలి చేసేలా విజయసాయిరెడ్డి సమాధానాలు ఇచ్చారని, ప్రస్తుతానికి ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ రెడ్డికి వచ్చిన ప్రమాదం ఏమి లేదని అర్థం అవుతోంది. వీటన్నింటిని అంచనా వేసే ఓ ప్లాన్ ప్రకారమే రాజ్ కసిరెడ్డిని అజ్ఞాతంలో ఉంచేలా పార్టీ పెద్దలే డైరెక్షన్స్ ఇచ్చారని విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ తర్వాత అనుమానాలు బలపడుతున్నాయి.