బాలకృష్ణ డైలాగులు చెప్పడంలో దిట్ట. స్క్రిప్ట్ ప్రకారం ఉన్న డైలాగులను ఎంత వీరోచితంగా చెబుతాడో, స్క్రిప్ట్ లేకుండా మాట్లాడే సమయంలో అంత పేలవంగా ఉంటాయి బాలకృష్ణ స్పీచ్ లు. కొన్నిసార్లు ఒక పదానికి బదులు ఇంకొక పదం వాడడం వల్ల నెటిజన్లు బాలకృష్ణ ను విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇటీవల నందమూరి సుహాసిని కూకట్పల్లి నుంచి పోటి చేస్తున్న సందర్భంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆ సమయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఒక పదానికి బదులు ఇంకొక పదం వాడుతూ టంగ్ స్లిప్ అయ్యారు. హరికృష్ణ అకాల మరణం తమని దిగ్భ్రాంతికి గురి చేసింది అనబోయి, తమని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది అని పొరపాటుగా అన్నారు. దీంతో నెటిజన్లు బాలకృష్ణ పై విరుచుకు పడ్డారు. అయితే ఇప్పుడు అదే నెటిజన్ల తరహాలో విజయసాయిరెడ్డి కూడా బాలకృష్ణ పై సెటైర్ వేశారు.
విజయసాయి రెడ్డి ట్వీట్ చేస్తూ, “మీ అన్న హరికృష్ణ గారు చనిపోవడం మీకు సంబరం తో కూడిన ఆశ్చర్యం కలిగించిందా? అవును, తండ్రికి వెన్నుపొడిచి కాటికి పంపిన వాడితో చేతులు కలిపిన చరిత్ర కదా. కుటుంబ సభ్యలు మరణిస్తే ఆనందం కలుగుతుందా? నిజమే మాట్లాడావా బాలయ్యా.” అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే బాలకృష్ణ ది ముమ్మాటికీ టంగ్ స్లిప్పే. దానిపై నెటిజన్లుు ఫైర్ అవడం కూడా సమంజసమే కానీ విజయసాయిరెడ్డి స్థాయి నాయకులు కూడా వీటిని రాజకీయం చేయాలనుకోవడం ఆశ్చర్యం.
మీ అన్న హరికృష్ణ గారు చనిపోవడం మీకు సంబరం తో కూడిన ఆశ్చర్యం కలిగించిందా? అవును, తండ్రికి వెన్నుపొడిచి కాటికి పంపిన వాడితో చేతులు కలిపిన చరిత్ర కదా. కుటుంబ సభ్యలు మరణిస్తే ఆనందం కలుగుతుందా? నిజమే మాట్లాడావా బాలయ్యా.
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 18, 2018