విజయసాయిరెడ్డి స్టైలే అంత. ఎవరేమనుకున్నా ఆయన మాత్రం పట్టించుకోరు. ట్విట్టర్లో అందర్నీ బూతులు తిడుతూ ఉంటారు. అదే సమయంలో ఎవరు కీలక పదవిలోకి వస్తారా .. వాళ్లని ఎలా కాకా పడదామా అనే ఆలోచన మాత్రం వదిలి పెట్టారు. రాష్ట్రపతి పదవికి ప్రచారంలో ఉన్న పేర్లు అందరినీ కలుస్తూ శాలువాలు కప్పిస్తూ.. అతి వినయం ప్రదర్శిస్తూ.. తిరుపతి లడ్డూలో.. లేకపోతే మరొకటే బహుమతులు ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలువుర్ని కలిసి అభినందించగా.. తాజాగా నయా రాయ్పూర్ వెళ్లారు.
చత్తీస్ఘడ్ గవర్నర్ అనసూయ ఉయికీ పేరు కూడా రాష్ట్రపతి రేసులో ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకే అపాయింట్ మెంట్ తీసుకున్నారు. వెళ్లారు. కలిశారు. సన్మానం చేశారు. పరిచయాలు పెంచుకుని వచ్చారు. ఈ విషయాన్ని విజయసాయిరెడ్డి ప్రకటించుకోలేదు.. చత్తీస్ ఘడ్ గవర్నర్ కార్యాలయం ట్వీట్ చేస్తే.. వాటిని రీ ట్వీట్ చేసుకున్నారు. ఎవరు దేశంలో ఉన్నత పదవుల్లోకి వస్తారో వారిని ముందుగా వెళ్లి పలకరించి మద్దతు ఇస్తున్నామని.. తమ గురించి కాస్త చూసుకోవాలన్నట్లుగా ఫీలర్ ఇచ్చి రావడం విజయసాయిరెడ్డికి ఓ దినచర్యలా మారింది. వైసీపీ ఆయనకు ఇచ్చిన బాధ్యతల్లో అదొకటి అయిపోయింది.
కేసుల కారణంగా ఎప్పుడైనా వారి అవసరం పడుతుందన్న ఉద్దేశంతో విజయసాయిరెడ్డి ఇలా వ్యవహరిస్తూంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతంలో రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ ను ఎంపిక చేసినప్పుడు ఆయన కాళ్లపై పడటమే కాదు.. జగన్ చేతా అదే పని చేయించి విమర్శలు ఎదుర్కొన్నారు విజయసాయిరెడ్డి