వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాహుల్ గాంధీపై అత్యంత దారుణమైన ఆరోపణలు చేయడం కలకలం రేపుతంది. రాహుల్ గాంధీ సీఎన్ఎన్ జర్నలిస్టు అయిన తన స్నేహితురాలి పెళ్లికి నేపాల్ వెళ్లారు. అక్కడ ఓ నైట్ క్లబ్లో ఉన్న సమయంలో వీడియోలు బయటకు వచ్చాయి. అందులో నేపాల్‌లోని చైనా దౌత్యవేత్త య హంకీ ఉన్నారని.. ప్రచారం జరిగింది. ఈ అంశంపై విజయసాయిరెడ్డి కూడా ట్వీట్ చేశారు. యోహంకీ కూడా రాహుల్‌తో ఉన్నారని చైనా హనీ ట్రాప్‌లకు పాల్పడుతున్నసమయంలో రాహుల్ ఇలా చేయడం ఏమిటన్నారు.
విజయసాయిరెడ్డి ట్వీట్ లో చాలా దురార్థం ఉండటంతో కాంగ్రెస్ వర్గాల్లోనూ కలకలం ప్రారంభమయింది. దురుద్దేశ పూర్వకంగా బీజేపీ నేతల ప్రోద్భలంతా విజయసాయిరెడ్డి ఆ ట్వీట్ చేశారని అంటున్నారు. నిజానికి నైట్ క్లబ్ లో రాహుల్‌తో ఉన్నది యోహంకీకాదని.. ఆమె నేపాల్‌కు చెందిన మహిళేనని అనేక మీడియా సంస్థలు వెల్లడించాయి. ఆమె పెళ్లి కూతురు స్నేహితురాలుగా చెబుతున్నారు. అయితే సంబంధం లేకపోయినా అంతర్జాతీయంగా భారత్ పరువు పోయేలా చైనా దౌత్యవేత్తను హనీ ట్రాప్ కు పాల్పడినట్లుగా చెప్పడమే కాదు.. రాహుల్ గాంధీ ఇమేజ్ ను కించపరిచేలా ఆ ట్వీట్ చేయడం ఇప్పుడు కలకలంరేపుతోంది.
కాంగ్రెస్ వర్గాలు విజయ సాయిరెడ్డిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నీడలో ఎదిగి.. ఇప్పుడు ఆ పార్టీపైనే తప్పు అని తెలిసినార విషం చిమ్ముతున్నారని మండి పడుతున్నారు. ఈ వివాదంలో బీజేపీ నేతలు ట్వీట్లు చేశారు. కానీ ఎవరూ చైనా దౌత్యవేత్త పేరును ప్రస్తావించి కించపర్చలేదు. అలా చేసింది విజయసాయిరెడ్డి మాత్రమే. దీంతో వివాదం ప్రారంభమయింది.