ఏపీ బీజేపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒకటి బీజేపీ, మరొకటి ప్రో వైసీపీ., ప్రో వైసీపీ నేతలకు అధ్యక్షుడిగా విజయసాయిరెడ్డి వ్యవహరిస్తున్నారు. పురందేశ్వరి పార్టీని టీడీపీకి తాకట్టు పెట్టేస్తున్నారంటూ… ప్రో వైసీపీ నేతలంతా కలిసి హైకమాండ్ కు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరందరికీ విజయసాయిరెడ్డి సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఇటీవల రాయలసీమలో చాలా మంది బీజేపీ నేతలు పురందేశ్వరిపై ఆరోపణలు చేస్తున్నారు. ఇలా ఆరోపణలు చేసిన వారందర్నీ పురందేశ్వరి ఎక్కడికక్కడ సస్పెండ్ చేస్తున్నారు.
వైసీపీ సర్కార్ పై తీవ్ర విమర్సలు చేస్తున్న పురందేశ్వరిని విజయసాయిరెడ్డి టార్గెట్ చేసుకున్నారు. తానే బీజేపీ నేత అయినట్లుగా… బీజేపీని టీడీపీకి తాకట్టు పెట్టేస్తున్నారని బాధపడిపోతున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే… టీడీపీ కి మేలు చేయడమేనని.. బీజేపీ అలా చేయకూడదని ఆయన వాదన. పురందేశ్వరిపై వ్యక్తిగతంగా కూడా ఇష్టం వచ్చినట్లుగా కూడా ఆరోపణలు చేస్తున్న ఆయన … బీజేపీలో ఓ వర్గం నేతలతో… హైకమాండ్ కు ఫిర్యాదులు చేయించి…. ఆమెను పదవి నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే బీజేపీ నేతలతో ఆయన ఓ గ్రూప్ ను ఏర్పాటు చేసుకున్నారు. వారందరూ ఢిల్లీకి వెళ్లి పురందేశ్వరిపై ఫిర్యాదు చేయనున్నారు. కానీ బీజేపీ హైకమాండ్ ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజీగా ఉంది. అందుకే ఆలోచిస్తున్నారు. కారణం ఏదైనా ఏపీ బీజేపీలో చిచ్చు పెట్టడానికి.. .. విజయసాయిరెడ్డి ఓవర్గానికి అధ్యక్షుడిగా మారిపోవడం ఆ పార్టీలో మరో వర్గం నేతల్ని ఆశ్చర్య పరుస్తోంది. మా పార్టీ వ్యవహారాల్లో ఆయన జోక్యమేందని ముక్కున వేలేసుకుంటున్నారు.