విజయసాయిరెడ్డి మళ్లీ విశాఖకు ఎంట్రీ ఇచ్చారు. సాయన్న ముసలాడైపోయాడు ఆయనకు రిటైర్మెంట్ ఇస్తున్నాం అని అంతర్గత సమావేశంలో ప్రకటించిన తర్వాత కూడా మళ్లీ విశాఖ బాధ్యతలు ఇచ్చారు జగన్. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడంతోనే ఇలా మళ్లీ విశాఖ బాధ్యతలను విజయసాయిరెడ్డి తెచ్చుకున్నారని అంటున్నారు. అయితే ఆయన విశాఖ రావడం మెజార్టీ వైసీపీ నేతలకు ఇష్టం లేదు. మళ్లీ ఆయన పెత్తనం ఏమిటి అని చాలా మంది సైలెంట్ అయిపోయారు.
విజయసాయిరెడ్డి వైసీపీ అనధికారిక సీఎంగా వ్యవహరిస్తూ దోపిడీకి పాల్పడ్డారు. వైసీపీ నేతలతోనూ సున్నం పెట్టుకున్నారు. గుడివాడ అమర్నాథ్ ఆయనపై చాలా సార్లు హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. ఇక ఎంవీవీ సత్యనారాయణతో గొడవ గురించి చెప్పాల్సిన పని లేదు. విజయసాయిరెడ్డి విశాఖలో ఉంటే చేసినవన్నీ సెటిల్మెంట్లు, ఆస్తుల దోపిడీలు. విశాఖ దసపల్లా, ఎన్ సి సి భూములు, హయగ్రీవ ఇలా లెక్కలేన్ని స్కాములు ఉన్నాయి.
విజయసాయిరెడ్డి తన కుమార్తె, అల్లుడి పేరుతో వందల ఎకరాలు కొనుగోలు చేశారు. వారు కొనుగోలు చేస్తే తనకేం సంబంధం అని ఆయన వాదించారు. బీచ్ రోడ్ లో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఓ కొండను ఆక్రమించి ఓ యూనివర్శిటీ కట్టేద్దామని ప్లాన్ చేశారు. ఇలా దోపిడీలతో ప్రజలు తరిమికొట్టారు. విశాఖ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్స ఇక ఉత్తరాంధ్ర పెద్దను తానే అనుకున్నారు. కానీ జగన్ రెడ్డి విజయసాయితో చెక్ పెట్టారు. ఆయనను ఉభయగోదావరి జిల్లాలకు ఇంచార్జ్ గా పంపారు. దీనిపై ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లుగా చెబుతున్నారు.