విజయసాయిరెడ్డి చూడబోతూంటే వైసీపీని జనసేనలో విలీనం చేసి పవన్ కల్యాణ్ ను సీఎం చేయాలన్న కాన్సెప్ట్ తో రాజకీయం చేసేలా ఉన్నారు. పవన్ కల్యాణ్‌కు జాతీయ స్థాయిలో క్రేజ్ పెరిగిపోయిందని అలాగే ఆయన వయసు కూడా చిన్నది కాబట్టి ఏపీకి సీఎం అవ్వాలని ఆయన కోరుకున్నారు. విజయసాయిరెడ్డికి హఠాత్తుగా పవన్ కల్యాణ్‌పై ప్రేమ కలగడానికి కారణం మరోసారి జైలు జీవితం కళ్ల ముందు కనిపిస్తూండటమే. అరబిందో పేరుతో ఏపీలో చేసిన దందాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
పోర్టును ఎలా దోపిడీదారుల మాదిరిగా.. మాఫియా మాదిరిగా లాగేసుకున్నారో అలాంటివి చాలా విషయాలు వెలుగులోకి రాబోతున్నాయని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో విజయసాయిరెడ్డికి బీపీ పెరిగిపోతోంది. చంద్రబాబు సీఎంగా ఉంటే.. తమను ఇక శాశ్వతంగా జైల్లో ఉండేలా చేస్తారేమోనని నిద్రలేని రాత్రులు గడుపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్నంతా చంద్రబాబుపై విచ్చలవిడిగా మాట్లాడిన ఆయన ఉదయమే.. పవన్ కల్యాణ్ ను కాకా పట్టే ప్రయత్నం చేశారు.
అయితే విజయసాయిరెడ్డి పిచ్చి తెలివితేటల రాజకీయాన్ని గుర్తించలేని వారు ఎవరూ కూటమిలో ఉండరు కానీ.. ఆయనకు మాత్రం అసలు సినిమా ఇప్పుడే కనిపిస్తోందన్న సెటైర్లు పడుతున్నాయి. ఇలా కాదు కాని వైసీపీ మొత్తాన్ని జనసేన పార్టీలో విలీనం చేసి జగన్ తో కూడా జై పవన్ అనిపించి..పవనే రాష్ట్రానికి సీఎం అవ్వాలని ఉద్యమం చేయిస్తే చాలా బాగుంటుందని.. అప్పుడు ఏమైనా కాస్త నమ్మవచ్చని ఇతర నేతలు సెటైర్లు వేస్తున్నారు.