పుష్ప సినిమా విడుదలయినప్పుడు ఏపీలో టిక్కెట్ల రచ్చ జరుగుతోంది. అతి తక్కువ టిక్కెట్ రేట్లు అప్పుడు ఉన్నాయి. అయితే పుష్ప టీం.. తమ సినిమాపై నమ్మకంతో విడుదల చేశారు. ఈ సినిమాకూ ఏపీలో ఆటంకాలు ఎదురయ్యాయి. కానీ ఇప్పుడు పుష్పని విజయసాయిరెడ్డి పొగుడుతున్నారు. దీనికి కారణం సైమా అవార్డులు ఎక్కువగా పుష్పకే వచ్చాయి. ఈ అవార్డులు వచ్చి రెండు రోజులు అయిన తర్వాత అభినందన ట్వీట్ పెట్టారు. సినిమా రిలీజయినప్పుడు ఇబ్బందులు పెట్టి.. ఆ తర్వాత దేశవ్యాప్తంగా హిట్ అయినా ఒక్క మాట మాట్లాడకుండా ఇప్పుడు ప్రైవేటు అవార్డులు వస్తే అభినందిస్తూ ట్వీట్ పెట్టడం ఏమిటని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆయనను సోషల్ మీడియాలోనే ప్రశ్నిస్తున్నారు.
విజయసాయిరెడ్డి కొద్ది రోజులుగా తనదైన మార్క్ బూతు ట్వీట్లకు దూరంగా ఉంటున్నారు. మోడీని..బీజేపీని కాకా పట్టడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. తన ట్విట్టర్ ఖాతాను కార్పొరేట్ ఏజెన్సీకి అప్పగించి.. బీజేపీకి ఎలా అవసరం అయితే అలా ట్వీట్లు పెట్టుకోమని చెప్పినట్లుగా ఉన్నారు. బీజేపీని పొగుడుతూ కాంగ్రెస్ను తిడుతూ ఆయన ట్వీట్లు పెడుతున్నారు.
పాదయాత్రలో రాహుల్ కంటెయినర్అంటూ ఓ లగ్జరీ వీడియోను పోస్ట్ చేశారు. దానిపైనా నెటిజన్లు మండిపడుతున్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండి పడుతున్నారు. కానీ విజయసాయిరెడ్డి మాత్రం తీరు మార్చుకోలేదు. పెట్టిన తెలుగు ట్వీట్ అర్జున్ను కాకా పట్టడానికి చేసినట్లుగా ఉండటంతో ఆయనపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. కానీ ఇలాంటివి ఆయన పట్టించుకోరు.
పాన్ ఇండియా మూవీగా రికార్డ్స్ బ్రేక్ చేసి సైమా అవార్డుల్లో సత్తాచాటి ఏకంగా 6 అవార్డులు గెలుచుకున్న 'పుష్ప' చిత్రం యూనిట్ కు అభినందనలు. సినిమాలో అల్లు అర్జున్ నటన, సుకుమార్ దర్శకత్వం అద్భుతం. తెలుగు సినిమా 'తగ్గేదే లే' అని నిరూపించారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 12, 2022