విజయసాయి రెడ్డి ఫిక్సయిపోయారు. ఇక జగన్ చెప్పినా వినేది లేదంటున్నారు. గతంలోనే తాను నిర్ణయం తీసుకున్నా జగన్ ఆపడంతో ఆగిపోయానని ఈ సారి ఎవరు చెప్పినా వినేది లేదంటున్నారు. ఏ విషయంలో అంటే టీవీ చానల్ ప్రారంభించే విషయంలో. ఓ అధికారణి భర్త తనపై చేసిన ఆరోపణలు, దానిపై మహా టీవీలో వంశీ చైసిన మారధాన్ కవరేజీతో బాగా హర్ట్ అయిన విజయసాయిరెడ్డి విశాఖలోనే ప్రెస్ మీట్ పెట్టారు. మహాటీవీ, వంశీ పై విరుచుకుపడ్డారు. ఆయనే టీవీ చానల్ పెట్టగా.. ఎంపీని నేను పెట్టలేనా అని సవాల్ చేశారు . పెట్టేస్తానన్నారు. రెండున్నరేళ్ల కిందట చానల్ పెట్టాలనుకున్నా… జగన్ ఆపారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మాత్రం పెట్టి తీరుతానన్నారు
చానల్ పెట్టాలంటే విజయసాయిరెడ్డికి డబ్బుల కొరతేమీ ఉండదు. ఆయన పుణ్యాన అరబిందో గ్రూప్.. కంపెనీల వేల ఆస్తులు పోగేసుకున్నాయి. వారికి టీవీ చానల్ అనేది చిన్న విషయం. కానీ మీడియాలో ఇలా పగ తీర్చుకోవడానికి వస్తా అంటే.. మొదటికే మోసం వస్తుంది. ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే మొదటికే మోసం వస్తుంది. ఈ విషయం పక్కన పెడితే… ప్రెస్మీట్ లో విజయసాయిరెడ్డి పూర్తిగా ఆందోళనతో ఉన్నట్లుగా మాట్లాడారు. తనపై వస్తున్న ఆరోపణలతో ఆయన కుటుంబంలోనూ అనుమానాలు వచ్చాయేమో కానీ… ఆయన అది చేస్తా… ఇది చేస్తా అని కీచుగొంతుతో వార్నింగ్ ఇచ్చారు. తన ఇంటి దగ్గరకు ఎవరో ఇద్దరు ఓ లేడీ, ఓ పురుషుడు వచ్చి.. తన గురించి వాకబు చేశారని.. వారు టీడీపీ వాళ్లే అయి ఉంటారని… అన్నారు. డైరక్ట్ గా ఫేస్ చేయాలని ఆ వచ్చిన వాళ్లకు సవాల్ చేశారు.
విజయసాయిరెడ్డి పరిస్థితి చూస్తూంటే… గతంలో కన్నుమిన్నూ కానరాకుండా ఇతరులపై చేసిన తప్పుడు ప్రచారాల ఫలితం అనుభవిస్తున్నాడని.. అదేంత దుర్భరంగా ఉంటుందో ఆయనకూ అర్థమవుతుందని ఎవరికైనా స్పష్టత వస్తుంది. విశాఖ పార్టీ నేతలు ఎవరూ ఆయనతో ప్రెస్ మీట్ లో కూర్చునేందుకు ఆసక్తి చూపించలేదమో కానీ.. జూపూడి ప్రభాకర్ ను మాత్రమే పక్కన కూర్చోబెట్టుకున్నారు. మొత్తంగా విజయసాయిరెడ్డి… బెదిరింపులకు దిగి తనపై ప్రచారాల్ని ఆపాలనుకుంటున్నారు. లేకపోతే తాను చానల్ ప్రారంభించి.. అదే ప్రచారాలు చేస్తానని అంటున్నారు. విజయసాయిరెడ్డి పరిస్థితి చూస్తే.. చేసుకున్నవాడికి చేసుకున్నంత అని ఎవరైనా అనుకోకతప్పదు.