వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పై దాఖలైన అనర్హత పిటిషన్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కొట్టేశారు. విజయసాయిరెడ్డికి అనర్హత వర్తించదని స్పష్టం చేశారు. లాభదాయక పదవి నిర్వహిస్తున్నారని ఫిర్యాదు పై కేంద్ర ఎన్నికల కమిషన్ అభిప్రాయాన్ని రాష్ట్రపతి తీసుకున్నారు. పార్లమెంటు అనర్హత నిరోధక చట్టం, న్యాయస్థానాలు తీర్పు మేరకు అనర్హత వర్తించదని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతికి సమాచారం ఇచ్చింది. జి.ఓ.75 ప్రకారం ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఎటువంటి జీతభత్యాలు తీసుకోవడం లేదని విజయసాయిరెడ్డి డిక్లరేషన్ ఇచ్చారు.
విజయసాయిరెడ్డిపై అనర్హతా వేటు వేయాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది బీజేపీ నేతలే. సుప్రీంకోర్టు తీర్పులు… గత నిర్ణయాలు… ప్రస్తుతం.. వాటికి తగ్గట్లుగా విజయసాయిరెడ్డి పదవికి ఎలా అనర్హుడో వివరిస్తూ… ఆ ఫిర్యాదును పంపారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత హఠాత్తుగా… విజయసాయిరెడ్డిని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కానీ రెండు వారాల్లోనే ఆ జీవోను ఉపసంహరించారు. కానీ అప్పటికే విజయసాయిరెడ్డి అ పదవిని చేపట్టారు. తక్షణం అమల్లోకి వస్తుందని.. ఆ జీవోలో చెప్పడంతోనే ఆయన పదవి చేపట్టినట్లయింది.
కానీ కొన్ని రోజులకు హఠాత్తుగా.. ఆ జీవోను రద్దు చేశారు. ఇలా ఎందుకు చేశారో చాలా మందికి అర్థం కాలేదు కానీ.. వెంటనే.. లాభదాయక పదవుల చట్టాన్ని.. ఏపీ సర్కార్ సవరించి… ఎంపీలను ఆ జాబితానుంచి తొలగించింది. అప్పుడు.. అసలు విషయం వెల్లడయింది. విజయసాయిరెడ్డికి ఇచ్చిన పదవి.. రాజ్యాంగ విరుద్ధంగా ఇచ్చారని.. అనర్హతా వేటు భయంతో.. జీవోను రద్దు చేసి.. చట్టాన్ని సవరించారని స్పష్టమయింది. మళ్లీ కొత్త జీవో జారీ చేసి.. విజయసాయిరెడ్డిని అదే పదవిలో నియమించారు. టీడీపీ నేతలు.. అప్పట్లో ప్రభుత్వంపై విమర్శలు చేసి సైలెంటయ్యారు.. కానీ బీజేపీ నేతలు మాత్రం.. విజయసాయిరెడ్డిపై నేరుగా రాష్ట్రపతికిఫిర్యాదు చేశారు. చివరికి విజయసాయిరెడ్డిని ఆ జీవోనే రక్షించిందని భావిస్తున్నారు.