బీజేపీకి మద్దతు అని ఎప్పుడు ప్రకటించే అవకాశం వస్తుందా అని వైసీపీ నేతలు ఎదురు చూస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ మాట్లాడటం లేదని..పార్లమెంట్ ద్వారా ప్రజలకు సమాధానం ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. స్పందించకపోవడంతో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాయి. వాటితో కాకపోయిన విడిగా బీఆర్ఎస్ కూడా ఓ అవిశ్వాస తీర్మానం ఇచ్చింది. తాము బీజేపీకి వ్యతిరికేమనేని అలా అని కాంగ్రెస్ వైపు లేమని చెప్పుకునేందుకు వారు అలా చేశారు.
కానీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం.. అమిత్ షా మాట్లాడతానంటున్నారు కాబట్టి..ఇతర పార్టీలకు వచ్చిన సమస్య ఏమిటని ప్రశ్నిస్తున్నారు. జాతీయ మీడియాకు.. తాము బీజేపీకే మద్దతుగా ఉంటామని ప్రకటించారు. వైసీపీ పరిస్థితి తెలుసు కాబట్టి అవిశ్వాసానికి మద్దతివ్వాలని ఎవరూ ఆ పార్టీని అడగలేదు. తమకే మద్దతివ్వాలని బీజేపీ వాళ్లు కూడా అడగలేదు. అయినా వైసీపీ వాళ్లు మాత్రం ఇంత కంటే గొప్ప చాన్స్ రాదన్నట్లుగా ప్రకటన చేసేశారు.
బీజేపీకి ఏ చిన్న సాయం వచ్చినా చేస్తమని.. తమను చల్లగా చూడాలని వైసీపీ నేతలు అనుకుంటున్నారు. ఆ చల్లని చూపులు రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. కేసులు, బెయిల్స్.. జైల్స్ విషయంలో మాత్రమే. ఎంపీల బలాన్ని ఇలానేరాల నుంచి బయటపడటానికి వాడుకుంటున్నారన్న విమర్శలు ఈ కారణంగానే వస్తున్నాయి.