వైసీపీలో రాజకీయం రసవత్తరంగా నడుస్తున్నట్లుగా విజయసాయిరెడ్డి తరచూ హింట్స్ ఇస్తూ ఉంటారు. ఇటీవల ఆయన పార్టీలో వ్యవహారాలకు జగన్తో పాటు ఆయన భార్య భారితిక సమాన క్రెడిట్ ఇస్తున్నారు. తనకు రాజ్యసభ సభ్యత్వం రాదని ఆయన అనుకున్నారు. అదే ప్రచారం జరిగింది. కానీ చివరి క్షణంలో ఆయనకు గుడ్ న్యూస్ వచ్చింది. అంతే కాదు ఆయనను పార్టీలో తీసి పక్కన పెట్టేసి నరెండు, మూడు రోజులకే కీలకమైన పదవి కూడా లభించింది.
ఆ సందర్భాల్లో ఆయన సోషల్ మీడియా.. మీడియాతో మాట్లాడుతున్నప్పుడు వైఎస్ జగన్తో పాటు భారతీకి కూడా కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా మరోసారి రాజ్యసభలో ప్రమాణం చేసిన తర్వాత కూడా వైఎస్ భారతీకి ధ్యాంక్స్ చెప్పారు. విజయసాయిరెడ్డి పదేపదే భారతిపేరును ఎందుకు సోషల్ మీడియాలోకి ఎక్కిస్తున్నారో వైసీపీ నేతలకు అర్థం కావడం లేదు. ఆయనపై జగన్ విశ్వాసం కోల్పోతే భారతి దగ్గర పలుకుబడి పెంచుకుని పదవులు కాపాడుకుంటున్నారని.., అందుకే భారతిపై ఎక్కడా లేనంత విశ్వాసం చూపిస్తున్నారన్న సెటైర్లు పడుతున్నాయి.
నిజం కూడా అలాగే ఉందని.. జగన్ ను మెప్పించడానికతే ఇతర పార్టీల నేతలపై బూతు ప్రయోగాలు చేస్తున్నారని అంటున్నారు . అయితే జగన్ ప్రసన్నం అయ్యారో లేదో కానీ..భారతి విషయంలో మాత్రం విజయసాయిరెడ్డి వ్యూహాత్మకంగానే వ్యహరిస్తున్నారు. భారతిని సందర్భం వచ్చినప్పుడల్లా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి హైకమాండ్ భారతి అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.