విశాఖలో సుబ్బారెడ్డి వర్సెస్ విజయసాయిరెడ్డి వివాదం ముదురుతోంది. సీఎం జగన్ ఉత్తరాంధ్ర బాధ్యతలను సుబ్బారెడ్డికి ఇచ్చారు. విజయసాయిరెడ్డికి అక్కడ పవర్స్ లేకుండా చేశారు. కానీ విశాఖ విషయంలో విజయసాయిరెడ్డి పట్టు వదలదల్చుకోలేదు. పదవి లేకపోయినా పార్టీపై పట్టు కొనసాగించాలని ప్రయత్నిస్తున్నారు. తన అనుచరులకే పదవులు ఉండేలా చూసుకుంటున్నారు. అయితే తాను ఇంచార్జ్ అయితే విజయసాయిరెడ్డి పెత్తనమేమిటని సుబ్బారెడ్డి రగిలిపోతున్నారు. వి.సా రెడ్డి అనుచరుల్ని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నారు.
మూడు రోజుల కిందట విజయసాయిరెడ్డి అనుచరుల్ని పార్టీ పదవుల నుంచి తొలగించారు సుబ్బారెడ్డి. వెంటనే విజయసాయిరెడ్డి పార్టీ అనుబంధ సంఘాల ఇంచార్జ్ హోదాలో మళ్లీ వారిని పార్టీ పదవుల్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తర్వాత .. సుబ్బారెడ్డి అసలు వారిని పార్టీ నుంచే సస్పెండ్ చేశారు. విశాఖలో ఓ కార్పొరేటర్ ను.. మరో డివిజన్ ఇంచార్జ్ ను పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కారణం చెప్పారు.
వీరద్దరూ విశాఖలో విజయసాయిరెడ్డి ప్రధాన అనుచరులు. గతంలో విజయసాయిరెడ్డికి విగ్రహం పెట్టి మరీ పాలాభిషేకం చేసిన ఘనులు వీరు. వీరు సుబ్బారెడ్డి వచ్చినా విజయసాయిరెడ్డి మాటే వింటున్నారు. అందుకే పార్టీ నుంచి గెంటేశారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి సైలెంట్ గా ఉండే అవకాశం లేదు. ఏం చేస్తారన్నది వైసీపీ వర్గాల్లోనే ఉత్కంఠగా మారింది. చినికి చినిికి ఈ వివాదం మరో బాలినేని, వైవీ తరహాలో మారుతుందా అని వైసీపీ నేతలు ఆందోళన చేందుతున్నారు.