‘ఉప్పెన’లో విజయ్‌సేతుపతి ఓ కీలకమైన పాత్ర చేశాడు. తెలుగులో పూర్తి స్థాయి విలన్‌గా కనిపించడం అదే తొలిసారి. ఆ సమయంలో విజయ్‌సేతుపతి భారీ పారితోషికం అందుకొన్నాడని, ఆయన కారణంగానే బడ్జెట్ పెరిగిపోయిందన్న వార్తలు బయటకు వచ్చాయి. విజయ్ రోజుకు రూ.50 లక్షలు తీసుకొన్నాడని, 25 రోజుల కాల్షీట్లు కేటాయిస్తే ఆయనకే దాదాపు రూ.12 కోట్లు ఇవ్వాల్సివచ్చిందని కూడా చెప్పుకొన్నారు. దీనిపై ఇప్పుడు విజయ్ క్లారిటీ ఇచ్చారు. నిజానికి ‘ఉప్పెన’ సినిమా చాలా తక్కువ మొత్తానికి చేశానని, పారితోషికం సరిగా అందుకోలేదని వ్యాఖ్యానించారు. విజయ్ నటించిన ‘మహారాజ’ సినిమా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సోమవారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ‘ఉప్పెన’ పారితోషికం గురించిన ప్రస్తావన వచ్చింది.
”ఆ సినిమాని కేవలం బుచ్చిబాబు కోసం చేశాను. తను కథ చెప్పిన విధానం, డైలాగులు రాసుకొన్న పద్ధతి నాకు బాగా నచ్చాయి. ఆయన కొత్త దర్శకుడు. వైష్ణవ్ తేజ్ కొత్త హీరో. అందుకే పారితోషికం తగ్గించుకొని నటించాను. నా పారితోషికం ఒక్కో సినిమాకు ఒక్కోలా ఉంటుంది. నిర్మాతలు తెలివైనవాళ్లు. మన మార్కెట్ ని బట్టే రెమ్యునరేషన్ ఇస్తారు” అని క్లారిటీ ఇచ్చారు విజయ్ సేతుపతి.