విజయసాయిరెడ్డి పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కేసులు పెడతారని అయినా భయపడి పార్టీలు మారవద్దని చెప్పుకొచ్చారు. మహా అయితే మూడు నుంచి ఆరు నెలలు జైల్లో పెట్టగలరని .. అంతకు మించి ఏమీ చేయలేరన్నారు. విశాఖలో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. జగన్ కోసం పదేళ్లు కష్టపడితే అధికారంలో వచ్చిన ఐదేళ్లలో నిండా ముంచేశారని కార్యకర్తల్లో అసంతృప్తి ఉందన్న ప్రచారాన్ని ఆయన ధృవీకరించారు. గత ఐదేళ్లలో కార్యకర్తలకు అన్యాయం జరిగిందనన అసంతృప్తి ఉందని అంగీకరించారు.
ఈ సారి మాత్రం కార్యకర్తలకే ప్రాధాన్యత ఇస్తామని చెప్పుకొచ్చారు. 2027 చివరిలో జమిలీ ఎన్నికలు వస్తాయన్నారు. బీజేపీ తమకు పరిస్థితులు అనుకూలంగా ఉంటే 2027 చివరిలో జమిలీ పెడతారని లేకపోతే 2029లో పెడతారని చెప్పుకొచ్చారు. అసలు రెండేళ్లు ముందు ఎన్నికలకు వెళ్లకపోతే ఆ పార్టీకి పరిస్థితి బాగోలేదన్నట్లే అన్న సిద్దంతాన్ని ఇలా బయటకు తెచ్చారు. జమిలీ ఎన్నికల బిల్లు పాసైనా 2034లోనే పూర్తి స్థాయి జమిలీ సాధ్యమవుతుందని అంటున్నారు.
విజయసాయిరెడ్డి కూడా అరెస్టు భయంతో ఉన్నారు. ఆయనపై చాలా కేసులు నమోదవుతున్నాయి. ఐదారు నెలలు జైల్లో పెడతారని అంతకు మించి ఏమీ చేయలేరన్నట్లుగా ఆయన చెప్పుకొస్తున్నారు కానీ.. అంతకు మించి సినిమా ఉంటుందని తెలుకు కాబట్టే.. కార్యకర్తల్ని రోడ్ల మీదకు వచ్చేలా చూడాలని అనుకుంటున్నారు. ాకనీ వీరి మాటల్ని విని ఎవరూ బయటకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు.