దేశ రాజధాని ఢిల్లీలో… ఉక్కు పరిశ్రమ కోసం…తెలుగుదేశం పార్టీ ఎంపీలు… రెండు రోజుల నుంచి… ఆందోళన చేస్తున్నారు. ఉక్కు మంత్రి బీరేంద్ర సింగ్ ను రెండు రోజుల్లో మూడు సార్లు కలిసి… కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై సానుకూలమైన ప్రకటన చేయించాలని ప్రయత్నించారు. కానీ.. మోడీ చెప్పనిదే తానేం చేయలేనని చేతులెత్తేసిన బీరేంద్రసింగ్.. ఎప్పుడూ చెప్పేదే చెప్పి పంపించారు. అయితే మెకాన్ నివేదిక రాగానే నిర్ణయం తీసుకుంటామన్న…ఓ సాంత్వన వాక్యం అయితే పలికారు. ఇంత వరకూ బాగానే ఉంది.. కానీ.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా హఠాత్తుగా ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. కానీ ఆయన వచ్చింది.. ఉక్కు పరిశ్రమ కోసం.. టీడీపీ ఎంపీలకు పోటీగా.. తమ వంతు ప్రయత్నాలు చేయడానికి కాదు. విశాఖలోని నేవల్ డాక్ యార్డ్ లో ఆరు వందల మంది ఎక్స్అప్రెంటీస్కు న్యాయం చేయాలన్న డిమాండ్ తో కేంద్ర రక్షణ శాఖ మంత్రిని కలిశారు. విశేషం ఏమిటంటే.. న్యాయం అంటే.. ఏమిటో.. ఈ ఎక్స్ అప్రెంటిస్ లు ఎవరూ క్లారిటీగా చెప్పలేదు. చివరికి విజయసాయిరెడ్డి కూడా…!
కచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు.. ఢిల్లీలో ఉక్కు పరిశ్రమ కోసం… ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలుస్తున్నప్పుడే… విజయసాయిరెడ్డి… వారిని తీసుకుని ఢిల్లీకి రావడం.. టీడీపీ వర్గాలను కూడా ఆశ్చర్య పరిచింది. దీనికి ఓ కారణం కూడా ఉంది. ఎందుకంటే.. ఇప్పుడు కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో వైసీపీ నోరు మెదపడం లేదు. బీజేపీ, వైసీపీ కలిసి.. కడప జిల్లాల్లో ఉక్కు ఫ్యాక్టరీని మళ్లీ గాలి జనార్ధన్ రెడ్డికి ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు ఇటీవలి కాలంలో ఊపందుకున్నాయి. ఈ విషయంలో ఎంత నిజం ఉందో కానీ.. స్టీల్ ఫ్యాక్టరీ తనకు ఇవ్వాలంటూ.. గాలి డిమాండ్ చేయడంతో… నిజమే కావొచ్చునన్న నమ్మకం పెరిగిపోయింది.
బీజేపీకి ఇప్పుడు గాలి జనార్ధన్ రెడ్డి ఆప్తుడు. వైసీపీ తరపున ఇప్పుడు ఢిల్లీలో వ్యవహారాలు చక్కబెడుతున్నది విజయసాయిరెడ్డి. అందుకే ఇప్పుడు టీడీపీ చేస్తున్న ఒత్తిడితో.. కేంద్రం స్టీల్ ఫ్యాక్టరీకి అనుకూలంగా ఏమైనా అనుకూల ప్రకటన చేసతుందేమోనన్న సంశంయంతో.. విజయసాయిరెడ్డి.. దాన్ని ప్రభావితం చేసేందుకు డిల్లీ వచ్చి ఉంటారన్న అనుమానాలు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. నిజమేమిటో తెలియదు కానీ.. కేంద్రం మాత్రం … ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో పాత పాటే పాడింది. దాంతో అదే సమయంలో విజయసాయిరెడ్డి వేరే కారణంతో ఢిల్లీలో ఉండటంతో.. ఆయనపై సహజంగానే అనుమానాలు ప్రారంభమయ్యాయి.