ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలాంటి వారిని పార్లమెంట్ కు పంపుతున్నారో ఆలోచించాల్సిన ఘటనలు ప్రతీ రోజూ జరుగుతున్నాయి. ఏపీ సమస్యలపై ప్రస్తావించమని పార్లమెంట్ కు పంపితే.. అడ్డగోలుగా సంబంధం లేని అంశాలపై చర్చకు పెడుతున్నారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి హీరోల రెమ్యూనరేషన్ల గురించి మాట్లాడారు. అసలు సినిమా బడ్జెట్లో అత్యధిక భాగం హీరోల రెమ్యూనరేషన్ కు పోతుందట. అదే.. సినిమాకు పని చేసే ఇతరులకు చాలా తక్కువ రెమ్యూనరేషన్ లభిస్తోందట. అందరికీ ప్రయోజనం కలగాలని చెప్పుకొస్తున్నారు.
విజయసాయిరెడ్డి .. మనసులో పవన్ కల్యాణ్ ఉన్నాడేమో కానీ.. ఆయనకు నేషనల్ లెవల్ లో ప్రాచుర్యం వస్తుందనుకున్నారో ఏమో కానీ.. సల్మాన్ ఖాన్ పేరును ప్రస్తావించారు. ఆయనకు రెండు వందల కోట్లు ఇస్తున్నారని ఎవరైనా చెప్పారేమో కానీ.. బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ వంటి బడా హీరోలు రూ.200 కోట్ల వరకు తీసుకుంటున్నారని బాధపడ్డారు. బడ్జెట్లో సింహభాగం హీరోలకు వెళ్లే సంస్కృతి మారాలని చెప్పుకొచ్చారు. హీరో కొడుకులే హీరోలు ఎందుకు అవుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు సినిమాటోగ్రఫీ చట్టాన్ని మార్చాలని సలహా ఇచ్చారు.
విజయసాయిరెడ్డి సహా వైసీపీ సభ్యులంతా ఇలా పనికి మాలిన విషయాలను.. సంబంధం లేని అంశాలను పార్లమెంట్ లో మాట్లాడుతున్నారు. ఏపీ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్న సందర్భమే ఉండటం లేదు. ఏదైనా అంటే.. బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించి చేతులెత్తేసి వస్తున్నారు. కూలీ, నీలి, సోషల్ మీడియాలో ఎలివేషన్లు వేసుకుంటన్నారు. మొత్తంగా ప్రజల్ని ఓ మాదిరిగా కూడా చూడటం లేదు.