పవన్ కళ్యాణ్, ఉండవల్లి , IYR కృష్ణారావు, జయప్రకాశ్ నారాయణ, తోట చంద్రశేఖర్ తదితరుల సంయుక్త నిజనిర్ధారణ కమిటీ (JFC) గురించి మాట్లాడుతూ విజయ్ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతా ఒక డ్రామా అని, చంద్రబాబు దీనికి దర్శకత్వం వహిస్తున్నాడని, మిగతా అందరూ పెయిడ్ ఆర్టిస్టులనీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే విజయసాయిరెడ్డి లాజిక్ మిస్సయ్యాడని నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
చంద్రబాబును విమర్శిస్తూ IYR కృష్ణారావు, ఉండవల్లి లాంటివాళ్లు కామెంట్లు చేసిన ప్రతిసారి సాక్షి మీడియాలో హెడ్ లైన్స్ వేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజకీయాలను పక్కనపెట్టి ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన డబ్బు ఎంతని లెక్కలు గట్టడానికి వీరంతా కలిసి పనిచేసి ఒక శాస్త్రీయమైన అంచనా వేస్తే దాన్ని విజయసాయి రెడ్డి లాంటి వాళ్లు విమర్శించడం ఏంటని సోషల్ మీడియాలో జనాలు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ వీళ్ళంతా నిజంగా పెయిడ్ ఆర్టిస్టులు అయి ఉంటే మరి IYR కృష్ణారావు, ఉండవల్లి లాంటివాళ్లు జగన్ తరఫున మాట్లాడినప్పుడు, అలాగే వైకాపా లీడర్ తోట చంద్రశేఖర్ కూడా విజయసాయిరెడ్డి అభిప్రాయం లో పెయిడ్ ఆర్టిస్టు లేనా అని ప్రశ్నిస్తున్నారు.
పైగా JFC నివేదిక ఇచ్చేంతవరకూ ఏ రాజకీయ పార్టీ లు కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన డబ్బు ఎంత అనే విషయంపై ఖచ్చితమైన లెక్కలు చెప్పలేకపోయాయి. అదీగాక ఇప్పటివరకు లక్ష కోట్ల పైనే ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినట్లు చెబుతున్న బిజెపి నేతలు కూడా ఈ నివేదికని తప్ప ని నిరూపించ లేకపోయారు ఒకవేళ ఈ నివేదిక లో పొందుపరచిన లెక్కలు తప్పే కనుక అయితే ఈపాటికి బిజెపి పెద్దలు చెలరేగిపోయి ఉండేవారు. దీన్ని బట్టే ఈ లెక్కల్లో కాస్తో కూస్తో విశ్వసనీయత ఉన్నాయి ఉందని అర్థమవుతోంది. ఈ లాజిక్ కూడా మిస్సయ్యారు విజయసాయిరెడ్డి .
ఆ మధ్య కూడా మత్స్యకారులు పసుపు రంగు పాంప్లెట్ వాడితే దానిపై కూడా లాజిక్ లేకుండా అసహనాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. (https://www.telugu360.com/te/yellow-fever-in-ysrcp-mp/) . ఇప్పటికైనా విజయసాయిరెడ్డి తన మాటల్లో లాజిక్ వుండేలా చూసుకుంటాడా లేదా అన్నది వేచి చూడాలి