విజయసాయి రెడ్డి అన్నంత పని చేస్తున్నారు. ఛానెల్ ఏర్పాటుకు తెర వెనక కసరత్తు చేస్తున్నారు. ఈమేరకు ఓ ఛానెల్ కు చెందిన వ్యక్తితో విజయసాయి రెడ్డి చర్చలు పూర్తి అయ్యాయని..భారీ ప్యాకేజీతో ఆయనకు ఛానెల్ నిర్వహణ బాధ్యతలు అప్పగించేందుకు రెడీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే దసరా నాటికి ఛానెల్ ప్రసారాలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అయితే, సాక్షి ఉండగా విజయసాయి రెడ్డి ప్రత్యేకంగా ఛానెల్ ఏర్పాటు చేయడం చర్చనీయాంశం అవుతోంది. ఇటీవల శాంతి – విజయసాయి రెడ్డి ఎపిసోడ్ లో విజయసాయి రెడ్డి కి వ్యతిరేకంగా ప్రచారం జరిగినా..సాక్షి నుంచి ఆయనకు మద్దతుగా కనీస ప్రసారాలు రాలేదు. దీని వెనక ఎవరి హస్తం ఉంది అన్నది విజయసాయి రెడ్డి గ్రహించినట్లు ఉన్నారు. తనపై ఆరోపణలు రావడానికి సొంత పార్టీ నేతలు కూడా కారణమనే భావనలో ఉన్నారు. అందుకే తనే ఛానెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.
Also Read : డీఎన్ఏ గురించి అడిగితే.. ఎన్‌డీఏపై పడ్డ విజయసాయి!
గతంలో ఛానెల్ ఏర్పాటుకు ప్రయత్నించినా జగన్ వద్దన్నారని ఆగిపోయానని చెప్పిన విజయసాయి రెడ్డి…ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక ఛానెల్ ఏర్పాటుకు ప్రయత్నించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీలో తన ప్రాధాన్యత తగ్గడానికి, తనకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోన్నా సాక్షి నుంచి కనీస మద్దతు లేకపోవడం వెనక సొంత పార్టీ నేతలు ఉన్నారని..వారిపై తను ఏర్పాటు చేయబోయే ఛానెల్ ద్వారా విజయసాయిరెడ్డి ఊపిరిరాడకుండా చేయనున్నారు అనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ విషయంలో విజయసాయిరెడ్డి తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని..అందుకే ఛానెల్ ఏర్పాటు విషయంలో జగన్ మాటను కూడా లెక్కచేయనని తెగేసి చెప్పారు. మొత్తానికి విజయసాయిరెడ్డి ఛానెల్ ఏర్పాటుకు సొంత పార్టీ నేతలే కారకులు అయినట్లుగా కనిపిస్తోంది.