పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న సభ్యులకు రాజ్యసభ వీడ్కోలు పలికింది. వారి పదవీ కాలం జూన్ వరకూ ఉన్నప్పటికీ ఆ లోపు మళ్లీ పార్లమెంట్ సమావేశాలులేవు. ఈ కారణంగా ముందుగానే రాజ్యసభ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇచ్చి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఏపీ నుంచి రిటైర్ అవుతున్న సుజనా చౌదరి, విజయసాయిరెడ్డి కూడా మాట్లాడారు. వీరు తమ పార్టీలకు కాకుండా ఇతర పార్టీలకు కృతజ్ఞతలు చెప్పడం అందర్నీ ఆకర్షించింది.
విజయసాయిరెడ్డి తనప్రసంగంలో కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. అయితేఆయన నెగెటివ్ కోణంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ రోజున తనపై కాంగ్రెస్ తప్పుడు కేసులుపెట్టి ఉండకపోతే తాను రాజ్యసభకు వచ్చి ఉండేవాడిని కాదన్నారు. నిజానికి అసలు అక్రమాస్తుల కేసులకు.. విజయసాయిరెడ్డికి రాజ్యసభకు ఎంపిక చేయడానికి సంబంధం ఎక్కడ ఉందో ఎవరికీ అర్థం కాలేదు. కాంగ్రెస్ పార్టీ తరపునసీఎంగా వైఎస్ ఉన్నప్పుడు ఆర్థిక పరంగా జగన్ కోసం చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి ప్రస్థానానికి కాంగ్రెస్ పార్టీ నే కారణం కాబట్టి.. నేరుగా పొగడలేక.. అలా నేగెటివ్గా కృతజ్ఞతలు చెప్పారని భావిస్తున్నారు.
ఇక టీడీపీ తరపునరాజ్యసభకు ఎంపికయ్యి… బీజేపీలో చేరినసుజనా చౌదరి..చంద్రబాబుకు మాత్రం పాజిటివ్ నోట్లోనే కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే.. చంద్రబాబు తనను రాజ్యసభకు పంపారని.. రెండు సార్లు చాన్సిచ్చారన్నారు. పన్నెండేళ్లు రాజ్యసభ సభ్యునిగా ఉన్న తాను ఈ సమయంలో చంద్రబాబుకు కృతజ్ఞత చెప్పకపోతే ఫెయిల్ అయినట్లేనన్నారు. ఆయననుచూసి చాలా నేర్చుకున్నాన్నారు. ప్రస్తుతం రాజకీయప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ ఆయనను తాను ఎప్పుడూ గౌరవిస్తాననే తెలిపారు.
విజయసాయిరెడ్డి జగన్ దయతలిస్తే మరోసారిరాజ్యసభకు వచ్చే అవకాశం ఉంది. కానీ సుజనా చౌదరికి మాత్రం ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. ఇతర రాష్ట్రాల నుంచి ఆయనను రాజ్యసభకు పంపే అవకాశం కనిపించడం లేదు.