జనసేనని ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో ఉన్నాడు పవన్. మరోవైపు మిగిలిన రాజకీయ పార్టీలు పవన్ ఉనికిని ప్రశ్నించడంలో బిజీగా మారాయి. దాదాపుగా అన్ని పార్టీల వాళ్లూ.. పవన్ పై వ్యంగ్య బాణాలు సంధిస్తున్నారు. రాజకీయాలతో సంబంధం లేనివాళ్లు కూడా పవన్‌ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాములమ్మ విజయ శాంతి కూడా గళం విప్పింది. తెలంగాణలో పవన్‌కి అంత సీన్ లేదని, తెలంగాణ రాజకీయాల కంటే ఆంధ్ర రాజకీయాలపై దృష్టి సారిస్తే మంచిదని సలహా ఇచ్చింది. ప్రజారాజ్యం పెట్టిన చిరంజీవి వల్లే.. ఏం కాలేదని, అలాంటిది తమ్ముడేం చేస్తాడని ఎద్దేవా చేసింది. ఆంధ్ర రాజకీయాలు వేరు, తెలంగాణ రాజకీయాలు వేరని, రెండు చోట్లా గెలవడం చంద్రబాబు నాయుడు వల్లేల కాలేదని అలాంటప్పుడు… పవన్ ఏం సాధించగలడని ప్రశ్నించింది. ఈ సమయం ఆంధ్రా రాజకీయాల కోసం వెచ్చిస్తే ఫలితం ఉంటుందని పవన్‌ని సలహా ఇస్తోంది రాములమ్మ. మరి… పవన్ ఫ్యాన్స్, జనసేన ఫాలోవర్స్ ఏమంటారో??