రాములమ్మకు చాలా రోజుల తర్వాత మణిపూర్ అంశం గుర్తుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా మణిపూర్ అంశంపై సోషల్ మీడియాలో స్పందించారు. మణిపూర్లో చాలా రోజులుగా ఘోరాలు జరుగుతున్నా.. ఇప్పటి వరకూ స్పందించలేదు. మొదటి సారి స్పందించారు. దీంతో ఆమె ఆ ట్వీట్ వెనుక అసలు ఇంటెన్షన్ తన అసంతృప్తిని వ్యక్తం చేయడమేనని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవల బీజేపీలో రాములమ్మ మాటే వినిపించడం లేదు. ఎవరూ పట్టించుకోవడం లేదు. చాలా మందికి పదవులు వస్తున్నాయి. అయినా రాములమ్మకు ఓ పదవి ఇద్దామని హైకమాండ్ కూడా అనుకోవడం లేదు. సమావేశాలకూ పిలవడం లేదు. దీంతో అసంతృప్తికి గురవుతున్నారు. ఇటీవల కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి వెళ్లి.. వెంటనే వచ్చేశారు. ఎందుకంటే..అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడన్న కారణం చెప్పారు. కిరణ్ ఇప్పుడు బీజేపీ నేతే కదా అని సొంత పార్టీ నేతలు విస్మయానికి గురయ్యారు.
కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరేటప్పుడు ఆమె కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ పదవిలో ఉండేవారు. బీజేపీలో చేరాక… అసలు ఆమె పొజిషన్ ఏంటో ఎవరికీ తెలియడం లేదు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తారో లేదో కూడా అర్థం కావడం లేదు. అందుకే తన అసంతృప్తిని ట్వీట్ల ద్వారా వినిపిస్తున్నారు. కానీ ఎవరైనా పట్టించుకుంటున్నారా అన్నదే అసలు డౌట్.