బీజేపీలోనూ విజయశాంతి ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. తనకు ప్రాధాన్యం దక్కడం లేదని కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆమె మీడియా ముందే వాపోయారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్న విజయశాంతి .. ఆ పార్టీపై అసంతృప్తితో గుడ్ బై చెప్పారు. బీజేపీలో చేరారు. మొదట్లో కొన్ని రోజులు యాక్టివ్గా ఉన్నప్పటికీ.. తర్వాత ఆమె సోషల్ మీడియాకే పరిమితమయ్యారు. అప్పుడప్పుడూ కేసీఆర్ నిర్ణయాలపై విమర్శలు చేయడం మినహా పెద్దగా తెర ముందుకు రావడం లేదు. పార్టీ కార్యాలయంలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో బీజేపీ నేతలందరూ తమ తమసీట్లకు ఖర్చీఫ్లు వేసుకుంటున్నారు.
కానీ విజయశాంతి విషయంలో స్పష్టత లేకుండా పోయింది. ఆమె కంటూ ప్రత్యేకంగా నియోజకవర్గం లేదు. గతంలో మెదక్ పార్లమెంట్.. మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చే్శారు. వచ్చే ఎన్నికల్లో ఆ స్థానాలు ఇస్తారో లేదో తెలియదు. ఏ స్థానాలు ఇస్తారో కూడా క్లారిటీ లేదు. అందుకే తన అసంతృప్తిని మీడియా ముందు వ్యక్తం చేశారు. తనను ఎందుకు మాట్లాడనివ్వడం లేదో బీజేపీ నేతలనే అడగాలన్నారు. ఏ స్థానం నుంచి పోటీ చేయాలో బీజేపీ నేతలకు క్లారిటీ లేదన్నారు విజయశాంతి ఇలా బహిరంగ అసంతృప్తి వ్యక్తం చేయడం బీజేపీలో కలకలం రేపుతోంది.
గతంలో ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి నేతలు ఆమె ఇంటి చుట్టూ తిరిగారు. ఇప్పుడు ఆమె అసంతృప్తి విషయంలో ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఇప్పటి వరకూ బీజేపీలో ఆమెకు దక్కుతున్న ప్రాధాన్యం చూస్తే.. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కూడా కష్టమేనన్న వాదన ఆ పార్టీలో అప్పుడే వినపిిసత్ోంది పెద్ద ఎత్తున చేరికలు ఉండటంతో.. కీలక నేతలు చేరితే చాన్స్ ఉండదని విజయశాంతి భావిస్తున్నారు.