ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి ఒక పార్టీ కాదు. కానీ వారిద్దరి మధ్య రాజకీయ వివాదం ఏర్పడితే రాజీ చేయడానికి విజయశాంతి రంగంలోకి దిగారు. ఇద్దర్నీ తమ్ముళ్లుగా అభివర్ణిస్తూ.. ఆమె సోషల్ మీడియా లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. వాళ్లిద్దరిని తమ్ముళ్లుగా అభివర్ణిస్తూ.. ఒకరితో ఒకరు పొట్లాడకుండా.. ఎవరికి వారుగా బీఆర్ఎస్ పై యుద్ధం చేయాలని సోషల్ మీడియాలో సలహా ఇచ్చారు.
తెలంగాణలోని దుర్మార్గ వ్యవస్థపై పోరాడవలసిన కర్తవ్యం మనకు తప్పనిసరిగా ఉన్నదని .. రతిపక్షాల నేతలు పరస్పరం చేసుకునే మాటల, సవాళ్ల దాడులు, బీఆరెస్‌కు ఉపయోగపడుతున్నాయన్నారు. ఈటల, రేవంత్ రెడ్డిలను తమ్ముళ్లుగా పేర్కొన్న విజయంశాంతి.. తమ దాడిని ఒకరిపై ఒకరు కాకండా ఎవరి ధోరణిలో వారు ప్రభుత్వంపై పోరాడటం అవసరమేమో… ఈ సందర్భంలో కొంచెం ఆలోచించాలని సలహాఇచ్చారు.ఇలా చెప్పడం తన బాధ్యత అని విజయశాంతి కవర్ చేసుకున్నారు.
మామూలుగా ఈటల రాజేందర్ .. రేవంత్ రెడ్డిపై ఎటాక్ చేయడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తో కలిసిపోయిందని చెప్పడానికి మునుగోడు ఉపఎన్నికల్లో డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. అయితే రేవంత్ రెడ్డి సీరియస్‌గా స్పందించారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద తడి బట్టలతో ప్రమాణం చేసేందుకు సిద్ధమా అంటూ ఈటలకు రేవంత్ సవాల్ విసిరారు.
ఈటల రాజేందర్ మాత్రం ఇంకా స్పందించలేదు. తను చెప్పాలనుకున్న అంశం ప్రజల్లోకి వెళ్తే చాలని ఈటల అనుకున్నారు.
ఈ అంశంపై సీనియర్ బీజేపీ నేత డీకే అరుణ భిన్నంగా స్పందించారు. ఈటల లైన్లోనే స్పందంచారు. రేవంత్ రెడ్డి ఇష్యూలో కాంగ్రెస్ కు బీఆర్ఎస్కు వత్తాసు పలుకుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ వత్తాసు పలకడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. వాస్తవాలు మాట్లాడితే రేవంత్ కు అంత ఉలిక్కిపాటు ఎందకని ప్రశ్నించారు. దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటైంది వాస్తవం కాదా అని డీకే అరుణ ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఈ వివాదం అంతకంతకూ పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి. అయితే విజయశాంతి రాజీ చేయడానికి ప్రయత్నిస్తే ఇతరులు కాంగ్రెస్ పై ఎదురుదాడి చేస్తున్నారు. విజయశాంతి తీరు బీజేపీలో హాట్ టాపిక్అవుతోంది.