కుటుంబ ఆస్తుల వివాదంలో జగన్ రెడ్డిని రోజు రోజుకు నిండా ముంచుతున్నారు సలహాదారులు. ఆయన కుటుంబంలోని పరిస్థితుల్ని ఆయన డీల్ చేసుకోలేకపోతున్నారు. సలహాదారులు ఆయనను గందరగోళ పెట్టి పిచ్చి పనులు చేయిస్తున్నాయి. ఆ పనులతో కుటుంబంలో మరింత అగాధం పెంచుతున్నారు. జగన్ రెడ్డి పరువును బజారున పడేస్తున్నారు.
తాజాగా విజయమ్మ రాసినట్లుగా ఓ లేఖను సృష్టించారు. అందులో ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేశారు. విజయమ్మ కారుకు కర్నూలులో ప్రమాదం జరిగింది. అది ఎలా జరిగిందన్నది ఇప్పటికీ మిస్టరీనే. కోటి రూపాయల విలువైన ఓ లగ్జరీ టొయోటా వెల్ ఫైర్ కారు టైర్లు రెండు ఒకే సారి పేలడం అనేది అసాధ్యం. కంపెనీ కూడా అదే గ్యారంటీ ఇస్తుంది. మరి ఏదో చేయకపోతే ఎలా పేలాయి ? అన్నది అందరికీ వచ్చే డౌట్. దీన్ని టీడీపీ రాజకీయం చేసింది.
దీనికి వైసీపీ కానీ జగన్ కానీ అంత కంగారు ఆడాల్సిన పని లేదు. కానీ పడుతున్నారు. ఎందుకంటే ఆ కారు జగన్మోహన్ రెడ్డినే తన తల్లి కోసం పంపించారు. అందులో సగం డబ్బులు షర్మిలతో కట్టించుకున్నారు. మిగిలిన సగం తన వాటాగా పార్టీలోని ఓ పారిశ్రామికవేత్తతో కట్టించారన్న గుసగుసలు ఉన్నాయి. ఆ కారు జగన్ పంపారు కాబట్టే కౌంటర్ ఇచ్చుకోలేని స్థితిలో వైసీపీ ఉంది. తల్లి పేరుతో ఖండిస్తే.. టీడీపీకి సరైన సమాధానం అనుకున్నారు. కానీ ఈ విషయంలో ఇన్వాల్వ్ కావడానికి ఆమె రెడీ కాలేదు. అందుకే అడ్వాంటేజ్ తీసుకుని సంతకాన్ని ఫోర్జరీ చేసేశారు.
ఆ సంతకాన్ని రేపు మరో విధంగా ఫోర్జరీ చేయరన్న గ్యారంటీ లేకపోవడంతో తీవ్రమైన హెచ్చరికలే వచ్చినట్లుగా ఉన్నాయి. వెంటనే డిలీట్ చేశారు. దీంతో ఉన్న పరువు.. అమ్మ దగ్గర ఏమైనా సానుభూతి ఉంటే అదీ కూడా పోతుంది. ఈ సలహా జగన్‌దా.. సజ్జలదా అని ఇప్పుడు వైసీపీ నేతలు మరోసారి పిసుక్కోవాల్సి వస్తోంది.